27.7 C
Hyderabad
April 25, 2024 09: 05 AM
Slider కృష్ణ

కరప్షన్: కలెక్టరేట్ లో అవినీతి తిమింగలం

acb raid

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అధికృత అధికారి (భూసంస్కరణలు) పనిచేస్తున్న ప్రశాంతిని ఏ.సి.బి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల రైడ్ తో కలెక్టరేట్లో కలకలం చెలరేగింది. రూ 3 లక్షల లంచం తీసుకుంటూ ప్రశాంతి ఏసీబీ అధికారులకు చిక్కారు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే అవినీతి అధికారిణి పట్టుబడటంతో ఇతర శాఖల అధికారులు బెంబేలెత్తిపోయారు. ప్రశాంతి తన కొద్ది పాటి సర్వీసులోనే రెండొవసారి ఏ .సి.బి కి చిక్కారు.

వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా, తాడేపల్లి మండలం, ఉండవల్లి సెంటర్ లో నివాసముంటున్న మెకా రామలింగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఏ .సి.బి అడిషనల్ ఎస్.పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వలపన్ని ఆమెను పట్టుకున్నారు. నాలుగు ఎకరాల భూమికి సంబంధించి లొసుగులు తొలిగించే నిమిత్తం 3 లక్షలు లంచం ఇవ్వాలని ఆమె రామలింగేశ్వరరెడ్డి ని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు ఏసీబీ కు అందింది. ఏసీబీ అధికారులు ఏ .ఓ భూసంస్కరణలు అధికారిణి దాసరి ప్రశాంతిని  రెడ్ హ్యాండ్ డ్ గా పట్టుకున్నారు.

Related posts

జై గుడివాడ: కాసినో నడిపిన వారికి రామ్ గోపాల్ వర్మ పూర్తి ‘‘మద్దతు’’

Satyam NEWS

సిపి ఐ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

Satyam NEWS

రాపిడ్ డెకాయిటీ: తమిళనాడు లోనూ కొట్టేశారు

Satyam NEWS

Leave a Comment