తెలంగాణ

అఖండ భారత్‌ సాకారం అవుతుంది

pjimage (2)

అఖండ భారత్ దిశగా మొదలైన మహా యజ్ఞానికి తొలి అడుగు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల తెలంగాణ కేంద్ర బిజెపి వ్యవహారాల కోఆర్డినేటర్  నూనె  బాల్ రాజ్  సంతోషం వ్యక్తపరిచారు. కాశ్మీరీల బాధలు తెలిసిన ఎవరి హృదయమైన ఆనందంతో ఉప్పొం గే రోజుగా ఆయన ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు.ఉగ్రవాదులకు దేశ విచ్ఛిన్నకర శక్తుల కు ముఖ ద్వారం లాంటి కాశ్మీర్ ఇప్పుడు దేశ భక్తుల చేతుల్లోకి వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తపరిచారు.   కాశ్మీరీ పండిట్ల కళ్ళలో ఆనంద భాష్పాలు రాలుతున్నాయ ని, భారతీయులందరికీ ఎంతో విలువైన రోజుగా ఆయన అభివర్ణించారు.కాశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులు తీసేస్తూ 370 ఆర్టికల్ రద్దు చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణయించిన నమో ప్రభుత్వం నిర్ణయంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ,పటేల్ తదితర నాయకులు ఆత్మ సంతోషించే రోజుగా నూనె బాల్ రాజ్  మోడీ నిర్ణయాన్ని అభినందించారు.ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఆయనకు కుడిభుజంగా దేశాభివృద్ధిలో తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర రాజకీయ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

అకాల వర్షం.. అన్నదాతకు తీరని నష్టం

Satyam NEWS

ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్ భేటి

Satyam NEWS

ఫేమ్ స్కీమ్ తో ఆర్టీసీపై మెగా కబ్జా?

Satyam NEWS

Leave a Comment