37.2 C
Hyderabad
April 19, 2024 12: 54 PM
Slider ఆదిలాబాద్

యాజమాన్యం తప్పిదం వల్లే ఎస్పిఎం పరిశ్రమ దుర్ఘటన

all party meet

ఎస్పిఎం పరిశ్రమ దుర్ఘటనపై ఆసిఫాబాద్ కాగజ్ నగర్ లోని ప్రజా కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SPM కార్మిక హక్కుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్పిఎం పరిశ్రమలో ప్రమాదం సంభవించిన ప్రదేశాన్ని పరిశీలించారు.

ఎస్పిఎం పరిశ్రమ మేనేజ్ మెంట్ అధికారి అయిన లకోడియ ను కలిసి పరిశ్రమలో కార్మికులకు త్రాగు నీటి సౌకర్యం, క్యాంటీన్ వసతులు ఏర్పాటు చేయాలని, కార్మికులకు ఈఎఫ్ఐ, పీఎఫ్, తదితర సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని, ప్రమాదం జరిగిన సమయంలో సైట్ ఇంజనీర్ ఎందుకు లేడని వారు ప్రశ్నించారు.

రాత్రి పూట బాయిలర్ నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు. యాజమాన్యం తప్పిదం కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేసియా వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి పూర్తిగా ఎస్పీఎం యాజమాన్యం బాధ్యత వహించాలని అన్నారు.

మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా పాల్వాయి హరీష్ బాబు, బెల్లంపల్లి సిపిఐ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ అన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్, డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేశ్, బద్రి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఇంకా బోగె ఉపేందర్, ముంజం ఆనంద్, అంబాల ఓదెలు, చంద్ పాషా, ఈశ్వర్, అల్లి రాజయ్య, కిషోర్ బాబు, కౌన్సిలర్లు దస్తగిరి, కిరణ్, మహేష్ మాజీ కౌన్సిలర్లు సింధం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, శ్రీరామ్, దేస్ ముఖ్ శ్రీనివాస్ మరియు కార్యకర్తలు సత్తిబాబు, దీపక్, ఇర్ఫాత్, పోచం, తాజ్ బాబా, జమీర్ కూడా పాల్గొన్నారు. SPM కార్మిక హక్కుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ గా మాజీ అసెంబ్లీ సీపీఐ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే గుండా మల్లేష్, వైస్ చైర్మన్ గా కొక్కిరాల విశ్వప్రసాద్, కన్వీనర్ గా డా.పాల్వాయి హరీష్ బాబు, సభ్యులు గా సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, సీపీఎం జిల్లా కమిటీ  నాయకులు ముంజం ఆనంద్, Citu అంబల ఓదేలు, సిపిఎం (ఎం.ఎల్)  చంద్ పాషా, Iftu ఈశ్వర్, రిటైర్డ్ టీచర్ అల్లి రాజయ్య, లారీ అసోసియేషన్ వి.కిశోర్ బాబు నియమితులయ్యారు.

Related posts

ప్రజాసమస్యల పరిష్కారానికి వార్డు ఆఫీస్ కావాలి

Satyam NEWS

మరో సారి అట్టుడికిన విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణం…!

Satyam NEWS

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

Satyam NEWS

Leave a Comment