31.2 C
Hyderabad
April 19, 2024 05: 52 AM
Slider ప్రత్యేకం ప్రపంచం

ఫ్రి ది నిపుల్ ఉద్యమానికి అమెరికా కోర్టు అనుమతి

free nipple

మగవారు స్వేచ్ఛగా చొక్కా విప్పుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటి స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండదు. మగవారు చేస్తే ఓకే. ఆడవారు చేస్తే తప్పా? అబ్బాయిలు, అమ్మాయిల మధ్య భేదం ఎందుకు? అంటూ కోర్టుకెక్కారు ముగ్గురు మహిళలు. అమెరికాలోని కొలరాడో సిటీ జారీ చేసిన యాంటీ టాప్ లెస్ ఆర్డినెన్సుపై ప్లెయింటిఫ్స్ బ్రిట్ హోగ్‌లాండ్, సమంతా సిక్స్ అనే ఇద్దరు మహిళలు 10 యు ఎస్ సర్క్యూట్ కోర్టులో దావా వేశారు. మహిళలను పబ్లిక్‌లో టాప్ లెస్‌గా తిరగనివ్వకపోవడం అంటే వారి స్వేచ్ఛకు, లింగ సమానత్వానికి భంగం కలిగించినట్లేనని వారు కోర్టులో వాదించారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద మార్పునకు దారి తీస్తాయని కోర్టు అభిప్రాయపడింది. మహిళలను టాప్‌లెస్‌గా తిరగనివ్వకపోవడం వల్ల ఆడవారి దేహం, స్థనాలు అంటే కేవలం శృంగారానికి సంబంధించినవనే భావన ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అభిప్రాయం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడం కోసమైనా టాప్ లెస్‌గా తిరగడానికి అనుమతి ఇవ్వాలని కోర్టు అభిప్రాయపడింది. అమెరికాలోని ఉటా, కొలరాడో, వోమింగ్, న్యూమెక్సికో, కన్సాస్, ఒక్లహామా రాష్ట్రాల్లో మహిళలు ఎదపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా స్వేచ్ఛగా తిరిగేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. మహిళలు టాప్ లెస్ గా తిరగడంపై నిషేధం విధిస్తూ ఆంక్షలు రావడానికి ఫ్రి ది నిపుల్ అనే ఉద్యమం. 2012లో లినా ఎస్కో అనే ఫిలిమ్ మేకర్ #FreeTheNipple అనే ఉద్యమం ప్రారంభించింది. ఈ హ్యాష్ ట్యాగ్ తో ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా అమె టాప్ లెస్ గా ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా తీసి విడుదల చేసింది. 2013 లో ఫేస్ బుక్ ఈ డాక్యుమెంటరీని, సంబంధిత ఫోటోలను డిలీట్ చేసింది. ఇది అశ్లీలం కిందికి వస్తుందని అందువల్ల తాము అలాంటి ఫొటోలను వీడియోలను ఉంచలేమని చెప్పింది. ఆ తర్వాత నుంచి ఫ్రీ ది నిపుల్ ఉద్యమం ఊపందుకుంది. లాజ్ ఏంజెలెస్ పోలీసులు ఇలా టాప్ లెస్ గా తిరుగుతున్న అమ్మాయిలను అరెస్టు చేసేవారు. బహిరంగ ప్రదేశాలలో తమ పిల్లలకు స్తన్యం ఇచ్చే వారిని కూడా పోలీసులు అదుపు చేసేవారు. దాంతో ఉద్యమం మరింత ఊపందుకుని చివరకు ఇంతవరకు వచ్చింది. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు తమ విజయమని వారు అంటున్నారు.

Related posts

Target Satyakumar: తమ నీడను చూసి తామే భయపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

వలస కూలీల ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

చిరాగ్, పారస్‌లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు

Sub Editor

Leave a Comment