34.2 C
Hyderabad
April 19, 2024 21: 00 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

జర్నలిజం ఫస్ట్…అంటే అర్ధం ఏమిటి?

pjimage (11)

జర్నలిజం ఫస్ట్ అంటే ఏమిటి? మనకున్న అన్ని వ్యాపారాలలో జర్నలిజం వ్యాపారం ఫస్ట్ అని అర్ధం. చాలా వ్యాపారాలలో నష్టం వచ్చే అవకాశం ఉంది కానీ జర్నలిజం వ్యాపారంలో ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అని స్థిర నిర్ణయానికి వచ్చేసిన వారు జర్నలిజం ఫస్ట్ అంటారు- బాగుందా ఈ డెఫినిషన్? మనకు బాగున్నా బాగుండకపోయినా ఆంధ్రప్రభకు మాత్రం ఎంతో లాభసాటిగా ఉంది. ఇప్పుడు చెప్పబోయే విషయం ఆంధ్రప్రభ మార్కు జర్నలిజానికి సంబంధించింది. జర్నలిజం అంటే పవిత్రమైనది. జర్నలిజం అనేది సమాజ సేవకు ఉపయోగించాలి- అని ఎవడైనా అంటే ఎవడ్రా కారుకూతలు కూసేది అనే మార్క్ జర్నలిజం ఇది. జర్నలిజం అనేది ఫక్తు వ్యాపారం అయిపోయింది. వ్యాపారం అయినా ఫర్లేదు… బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం అయిపోయింది. శ్రీచైతన్య విద్యా సంస్థలు తెలుసు కదా? బాగా డబ్బున్న సంస్థలు. పిండుకోవడానికి పాడి ఆవులా కనిపించింది ఆంధ్రప్రభ వాళ్లకు. ఇంకేం పిండేద్దాం అనుకున్నారు. ప్లాన్ వేసుకున్నారు. ఖమ్మం కు చెందిన ఒక బ్యాచ్ రిపోర్టర్లు వెళ్లి సదరు శ్రీచైతన్య వారిని కదిపి చూశారు. వారు కూడా ఏం కావాలి అని అడిగారు. రూ.40 లక్షలు ఇచ్చేస్తే చాలు అన్నారు ఆ బ్యాచ్ జర్నలిస్టులు. వామ్మో అంతా అని నోరు వెళ్లబెట్టారు తెలంగాణ శ్రీచైతన్య వాళ్లు. పదో పరకో అంటే సర్దుతాం కానీ లక్షలకు లక్షలు మీకు ఇచ్చేంత మా దగ్గర ఉండదని చెప్పారు. ఈ సమాధానం వారికి నచ్చలేదు. చేతిలో పేపర్ ఉంది కదా మరింకే నీ అంతు తేలుస్తాం అంటూ సదరు కాలేజీ వారిని బెదిరించారు. వారు బెదరలేదు. హెచ్చరించినట్లుగానే ఓ రోజు వార్త వచ్చేసింది. ఖమ్మంలో శ్రీచైతన్య మాఫియా అంటూ… కాలేజీ వాళ్లు వణికిపోయి తమ దగ్గరకు వచ్చేస్తారని అనుకున్నారు పాపం… ఆ ముఠా. కానీ ఇలాంటోళ్లను ఎంతో మందిని చూసిన శ్రీచైతన్య లొంగలేదు. వార్త రాయడమే కాదు, శ్రీచైతన్య కాలేజీలన్నింటిలో వారి పేపర్ కాపీలు పంచిపెట్టారు. శ్రీచైతన్య వాళ్లు లొంగలేదు…. మళ్లీ ఇంకో వార్త- కార్పొరేట్ కాలేజీల పేరుతో కోట్లు దోచేస్తున్న శ్రీచైతన్య అంటూ… మళ్లీ అదే ప్రాసెస్.. వార్త రాయడం, ఆ పత్రికల్ని వారి కాలేజీలలోనే పంచిపెట్టడం. కాలేజీ వాళ్లు లొంగలేదు… మళ్లీ ఇంకోటి ఫీజులు బారెడు చదువులు మూరెడు అని, అనుమతులు హుష్ కాకి అని…. ఇలా ఒక్క నెలలో దాదాపుగా 10 వార్తలు రాసేశారు. రాసుడు… క్యాంపస్ లో కాపీలు పంచుడు… ఒక్క ఖమ్మంలోనే కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నితెలంగాణ శ్రీచైతన్య కాలేజీ క్యాంపస్ లలో ఆంధ్రప్రభలో వార్త వచ్చిన రోజు కాపీలు పంచిపెట్టేవాళ్లు. ఎంతకీ రూ.40 లక్షలు రావడం లేదు. శ్రీచైతన్య వాళ్లు కూడా ఇలాంటోళ్లను చాలా మందిని చూసి ఉంటారు కదా పట్టించుకోలేదు. రాసుకోమని వదిలేశారు. ఆంధ్రప్రభ అంటే భయం లేదా? వణికిపోవాలి కదా, మన డబ్బలు మనకు ఇచ్చేయాలి కదా? ఎందుకు ఇవ్వడం లేదని మేనేజిమెంటు ఆరా తీయడం…. వామ్మో ఇదీ జర్నలిజం ఫస్ట్ అంటే. వార్త రాయడం పత్రిక కాపీలు పంచిపెట్టడం ఏమిటండీ బాబూ ఇది వారు తలపట్టుకుంటున్నారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు ఆ కాపీలు ఇవ్వడం, ఇంకా చర్య తీసుకోవడం లేదేమని అడగడం… ఇది కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారట. పత్రికకు ఏదైనా ప్రకటన అడిగితే ఇస్తామేమే కానీ ఇదేంటండీ బాబూ ప్రకటన ఇవ్వాలటా, మా కాలేజీ క్యాంపస్ ఒక్కో దాంటో 10 కాపీలకు చందాలు కట్టాలట. ఇలా చేయాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు….నాయన లారా…  ఇప్పుడు అర్ధం అయిందా జర్నలిజం ఫస్ట్ అంటే ఏమిటో……?

Related posts

నిరుపేదలకు సోంతింటి కల కెసిఆర్ లక్ష్యం

Bhavani

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు

Satyam NEWS

కాన్పూర్ హింసలో కొత్త ట్విస్ట్: పాకిస్తాన్ ప్రేరేపిత చర్యగా నిర్ధారణ

Satyam NEWS

Leave a Comment