28.2 C
Hyderabad
April 20, 2024 12: 17 PM
Slider ప్రకాశం

రామాయపట్నం పోర్టు పనులపై వత్తిడి తేవాలి

ramayapatnam

రామాయపట్నం మేజర్ పోర్టు పనులను తక్షణమే ప్రారంభించేలాగా పార్లమెంట్  సభ్యులందరూ కూడా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని కరుణాకర్ ప్రేమల (ఏపీ ప్రజా సంక్షేమ సమితి) డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి కి పార్లమెంటు సభ్యులు సహకరించి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని కూడా ఏపీ ప్రజా సంక్షేమ సమితి కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రతిపాదిత స్థలాలలో ఒకటి  ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం కాగా, మిగిలినవి విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి, నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం. తొలుత, రామాయపట్నంలోనే భారీ ఓడరేవు ఏర్పాటవుతుందని అందరూ ఊహించారు. అయితే, కొందరు నాయకులు దుగ్గరాజపట్నంతో పాటు, రామయపట్నం వద్ద కూడా ఓడరేవు నిర్మించాలని డిమాండు చేసారు. కానీ దుగరాజపట్నంలో నౌకాశ్రయం ఏర్పాటు చేయడానికి, పలు సాంకేతిక సమస్యలు, అడ్డంకులు ఎదురవుచున్న నేపథ్యంలో, మళ్ళీ తిరిగి రామాయపట్నంలోనే ఏర్పాటుచేయడానికై కేంద్రం సిద్ధపడిందని మనందరికీ తెలిసిన విషయమే. ఈ పోర్టు నిర్మించటం వలన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి రామాయపట్నం పోర్టు పనులు తక్షణమే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రజా సంక్షేమ సమితి కోరుతుంది.

Related posts

మామిడిపల్లి కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిక

Sub Editor

పాకిస్తాన్ కు ఊరట: FATF గ్రే లిస్ట్ నుంచి తొలగింపు

Satyam NEWS

లోకకళ్యాణార్ధం హత్యరాలలో వనదుర్గ మహావిద్య హోమం,యాగం

Satyam NEWS

Leave a Comment