Slider జాతీయం ముఖ్యంశాలు

అత్యవసర చికిత్సపై అరుణ్ జైట్లీ

arun jaitly

గత వారం ఎయిమ్స్ లో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ సమస్యలతో పాటు శ్వాస సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉన్నారని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, గత వారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నది. ఆయన రెండు కిడ్నీలూ పనిచేయడం లేదని, గుండె పనితీరు మందగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఈసీఎంఓ (ఎక్స్ ట్రా కార్పొరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్)ను అమర్చి, ఐసీయూలో చికిత్సను అందిస్తున్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి. తనంతట తానుగా ఆయన శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతోనే, ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని, సాధారణంగా కిడ్నీలు పనిచేయకుండా, గుండె పనితీరు మందగించిన వేళ, శ్వాస సమస్యలు వచ్చినప్పుడు ఈ వ్యవస్థను అమరుస్తామని వైద్యులు తెలిపారు.

Related posts

పొగరుతో కాదు నిజంగానే కొమ్ములొచ్చాయి

Satyam NEWS

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

Satyam NEWS

ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను

Satyam NEWS

Leave a Comment