32.7 C
Hyderabad
March 29, 2024 13: 10 PM
Slider శ్రీకాకుళం

జాతీయ స్థాయి పేద క్రీడాకారిణికి ఆర్థిక సహాయం

srikakulam student

శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామంలో ఉన్నత  పాఠశాల లో ఎనిమిదో తరగతి చదువుతున్న కోరాడ శారద గత నెల  రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో బాలికల విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించింది. ఈనెల 17న ఢిల్లీలో జాతీయ స్థాయి కుస్తీ పోటీలో కూడా పాల్గొంది. అయితే ఈ క్రీడాకారిణి తల్లిదండ్రులు ఆర్థికంగా బలహీనం కావడంతో, మూడువేల రూపాయలు  విలువగల ట్రాక్ షూట్ , బూట్లు, కుస్తీ పోటి సంబంధించిన ప్రత్యేకమైన దుస్తులు హైదరాబాదులో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ గా కళాశాలలో పనిచేస్తున్న పాత శ్రీకాకుళం పట్టణానికి చెందిన వేణుగోపాలరావు,  పెద్దపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు అందచేశారు. ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్భంగా  ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పాఠశాలలో అన్ని రంగాల్లో ప్రత్యేక నైపుణ్యత గల విద్యార్థిని విద్యార్థులకు ఎప్పుడు కూడా తమ సొంత డబ్బులతోనే, మిత్రుల, ఇతరులు ప్రోత్సాహంతో విద్యార్థులకు అనేక రంగాల్లో ప్రోత్సహిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అయినా పి.సత్యవతి, ఎం శాంతారావు, ఎస్ వి కృష్ణారావు, జి భూషణ రావు, డి.ఎం. మల్లేశ్వరి, కే సురేష్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు గుండ బాల మోహన్, క్రాఫ్ట్ బి . త్రివేణి, ఆర్ట్ సి.హెచ్. రవికుమార్ పాల్గొన్నారు.

Related posts

సోషల్ మీడియా లో హల్ చల్  చేస్తున్న మంచు విష్ణు ‘గోలీ సోడా వే’

Satyam NEWS

కుల పిచ్చికి బదిలీ శిక్ష: దిమ్మ తిరిగిన అమ్మిరెడ్డి

Satyam NEWS

ఎలర్ట్: కరోనాపై అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment