38.2 C
Hyderabad
April 25, 2024 12: 16 PM
Slider నిజామాబాద్

బిచ్కుంద మండల ఉత్తమ సర్పంచులకు ప్రశంస

bichkunda award

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో చేపట్టిన సంక్షేమ పథకాలు స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ రహితం మద్య నిషేధం వైకుంఠ ధామ నిర్మాణ పనులలో  త్వరగతిన పూర్తి చేసి ఉత్తమ ప్రతిభ కనబరచిన మండలానికి చెందిన పెద్దదడిగి గోపన్పల్లి బండరెంజల్ గ్రామాల సర్పంచ్లకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి చేతుల మీదుగా ప్రశంస  పత్రాలు అందుకున్నారు.

దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో బండరెంజల్ సర్పంచ్ గడ్డం బాల్రాజ్, పంచాయతీ కార్యదర్శి అనిత, గోపన్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఉపసర్పంచ్ నాగప్ప పంచాయతీ కార్యదర్శి మానస, పెద్దదడిగి సర్పంచ్ ఆకుల సాయిలు, ఉపసర్పంచ్ సాయిలు పంచాయతీ కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా రచ్చ శివకాంత్, బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్సీ వాడ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న రచ్చ శివకాంత్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు.

Related posts

ఢిల్లీ నుంచీ గ‌ల్లీ దాకా…! రామ‌తీర్ధానికి కేంద్ర మంత్రి మాండ‌వీయ‌….!

Satyam NEWS

ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తాం

Bhavani

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో భారీ రిగ్గింగ్ కు కుట్ర

Satyam NEWS

Leave a Comment