39.2 C
Hyderabad
March 29, 2024 15: 18 PM
Slider సినిమా

సక్సెస్ బాటలో బైలంపుడి

Bailampudi-2

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మించిన  చిత్రం బైలంపుడి. హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి జంటగా న‌టించ‌గా అనిల్‌ పిజి రాజ్‌ దర్శకత్వం వ‌హించారు.   గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుద‌లై ప్రేక్ష‌కుల ఆదరణ పొందింది. ఈ సంద‌ర్భంగా  చిత్ర యూనిట్ ఫిలించాంబ‌ర్ లో స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లూడుతూ ‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసక్తితో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని  నిర్మించాను. `ఇక్క‌డ యుద్ధం చేయాలి…గెల‌వ‌డానికి కాదు, బ‌త‌కాడినికి“ అనే కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చూసిన వాళ్లంద‌రూ సినిమా  బావుందంటున్నారు. నేను ఇందులో గురునారాయ‌ణ అనే విల‌న్ క్యార‌క్ట‌ర్ చేశాను. నిర్మాత‌గా, న‌టుడుగా నాకు ఈ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది. మౌత్ టాక్ తో ఇప్పుడిప్పుడే జ‌నం థియేట‌ర్స్ కు వ‌స్తున్నారు.

మరిన్ని ధియేటర్లు పెంచుతున్నాం

డిస్ట్రిబ్యూట‌ర్స్ కోరిక మేర‌కు  కొన్ని  థియేట‌ర్స్ కూడా పెంచుతున్నాం. ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ“ ఈ  సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. నేప‌థ్య సంగీతంతో పాటు పాట‌లు కూడా బావున్నాయంటూ కాల్స్  చేసి చెబుతున్నారు. ముఖ్యంగా `పిల్ల‌ల దేవుడు` పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది“ అన్నారు.  హీరో హ‌రీష్ విన‌య్ మాట్లాడుతూ…“ఫ‌స్ట్ డే   సంధ్య థియేట‌ర్ లో ఆడియ‌న్స్ తో  క‌లిసి సినిమా చూశాం. ఆడియ‌న్స్ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత మంచి రెస్పాన్స్ నా తొలి సినిమాకు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. పాటల రచయిత రామారావు మాట్లాడుతూ“ ద‌ర్శ‌క నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛ‌తో మంచి సాహిత్యాన్ని రాశాను. సుభాష్ అద్భుత‌మైన ట్యూన్స్ ఇచ్చారు. హీరోయిన్ తనిష్క తివారి మాట్లాడుతూ“ఇష్టంగా` సినిమా త‌ర్వాత ఓ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తోన్న త‌రుణంలో ఈ సినిమా అవ‌కాశం వ‌చ్చింది. ప‌ర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్ర‌లో న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంద‌న్నారు.

అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది

దర్శకుడు పిజి రాజ్ మాట్లాడుతూ ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి రెస్సాన్స్ బావుంది.  డిస్ట్రిబ్యూట‌ర్స్  కోరిక మేర‌కు ఇంకా  థియేట‌ర్స్  పెంచుతున్నాం. సుభాష్ సంగీతం, మా హీరో,  హీరోయిన్స్ న‌ట‌న‌, అలాగే మా నిర్మాత బ్ర‌హ్మానంద రెడ్డి చేసిన విల‌న్ క్యార‌క్ట‌ర్ కు రెస్పాన్స్ బావుంది. మా టీమ్ స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా తీయ‌గ‌లిగాను. మా సినిమాను  ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు. 

Related posts

కొల్లాపూర్ లో ఘనంగా బాలకృష్ణ పుట్టిన రోజు

Satyam NEWS

Political turmoil : మరో బ్రిటన్ మంత్రి రాజీనామా

Satyam NEWS

హుజూర్ నగర్ ఇండస్ట్రియల్ పార్కు భూమి పరిశీలన

Satyam NEWS

Leave a Comment