36.2 C
Hyderabad
April 25, 2024 22: 42 PM
Slider వరంగల్

గుడ్ డెసిషన్: మేడారం లో ప్లాస్టిక్ ను నిషేధిద్దాం

noplastic

దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని మెదిని సాంఘిక సేవాసంస్థ ప్రతినిధి కె ప్రకాష్ పిలుపునిచ్చారు. వరంగల్ నుండి మేడారం వరకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకాష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్బంగా నగరంలోని వరంగల్ మండలం 1వ డివిజన్ లోని  సరళి హైస్కూల్ విద్యార్థులు ప్రకాష్ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్బంగా ప్రకాష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని  పూర్తిగా నిషేధించాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. మేడారం జాతరలో భక్తులు చెట్లను నరకకుండా ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాయత్రి, ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు శశిధర్, సతీష్, రాకేష్ కరుణ పృద్వి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప అభయం

Satyam NEWS

తరతరాల తలనొప్పులను తీరుస్తుందా ఈ కొత్త సంవత్సరం?

Satyam NEWS

అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి

Satyam NEWS

Leave a Comment