35.2 C
Hyderabad
April 24, 2024 14: 17 PM
Slider సినిమా

భారతీయుడు 2 చిత్రం షూటింగ్ లో ముగ్గురు మృతి

bharateeyudu

భారతీయుడు 2 చిత్రం షూటింగ్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మరణించారు. చెన్నై సమీపంలోని పూనమల్లి వద్ద జరుగుతున్న షూటింగ్ లో ఈ విషాదం చోటు చేసుకున్నది. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక భారీ క్రేన్ కూలి కింద పడిపోయింది. దాంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ చిత్రానికి దర్శకుడు శంకర్. ఆయన కూడా అక్కడికి సమీపంలోనే పని చేస్తున్నారు. కొద్దిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కమల్ హసన్ ఈ చిత్రంలో హీరో కాగా ఇప్పటి వరకూ 30 శాతం మేరకు సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది.

Related posts

ముసలమ్మ గుట్ట ఎన్ కౌంటర్ మృతుల గుర్తింపు

Satyam NEWS

మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలి

Satyam NEWS

బాలివుడ్ ఛాన్సు కొట్టేసిన రష్మిక

Satyam NEWS

Leave a Comment