37.2 C
Hyderabad
March 28, 2024 18: 20 PM
Slider ప్రత్యేకం

త్వరత్వరగా సాగుతున్న దిశ కేసు దర్యాప్తు

disha

దిశ హత్య కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు తదుపరి విచారణ వేగంగా పూర్తి చేసేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా నిందితుల సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురిని వారం రోజుల పాటు కస్టడీకి షాద్ నగర్ కోర్ట్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నేడు నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. జైల్లో నే నిందితులకు వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. వారం రోజుల కస్టడీలో నిందితుల దగ్గర నుండి  స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకుంటారు.

ఈ వారం రోజులలో నిందితుల దగ్గర నుండి కీలక ఆధారాలు సేకరిస్తారు. అత్యాచారం, హత్య జరిగిన సంఘటన స్థలం వద్దకు నిందితులను తీసుకెళ్లి సీన్ రీకన్స్ స్ట్రక్షన్ చేస్తారు. సీన్ టూ సీన్ మొత్తం నిందితుల దగ్గర నుంచి వివరాలు సేకరింస్తారు. దిశ మొబైల్ ఎం చేశారు అనేది కూడా నిందితులకు పోలీసులు వేసే ప్రశ్న. దిశ ను ట్రాప్ చేసిన విధానం పై మరోసారి పోలీసులు ఆరా తీస్తారు.

ఇప్పటికే దిశ కేసును ఫాస్ట్రాక్ కోర్ట్ కు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఫాస్ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలంటూ మహబూబ్ నగర్  1st  అడిషనల్ సెషన్ జడ్జ్ కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులపై త్వరగా ఛార్జ్ షీట్ వేయడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

నిందితులను నలుగురి ని ఎక్కడ విచారిస్తారన్న దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కస్టడీ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద ఏలాంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని 144 సెక్షన్ విధించారు.

Related posts

బీజేపీ రైతు వ్యతిరేక చర్యలపై పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధం

Satyam NEWS

నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు

Bhavani

మీడియా ప్రతినిధులకు మాస్కుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment