31.7 C
Hyderabad
April 25, 2024 02: 29 AM
Slider జాతీయం

ఆక్షన్:పీరియడ్స్ చెక్ చేసిన ప్రిన్సిపాల్ సస్పెన్షన్

bujj collage principal suspended for removong girls underwears

గుజరాత్‌ భుజ్‌‌లోని శ్రీ సహజానంద గర్ల్స్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ విద్యార్థినులతో దుస్తులు విప్పించిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నెలసరిలో సమయంలో కిచెన్‌లోకి వెళ్లకూడదన్న ఆ కాలేజీ హాస్టల్ నిబంధనను ఉల్లంఘించారన్న అనుమానంతో వారి లోదుస్తులను తీయించి పీరియడ్స్‌లో ఉన్నారో లేదో చెక్ చేయించింది ప్రిన్పిపాల్ రీటా.

గత వారంలో దాదాపు 60 మందికిపైగా అమ్మాయిల్ని ఒక్కొక్కరుగా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి చేక్ చేశారు హాస్టల్ రెక్టార్ ప్రమీలా బెన్, ప్యూన్ నైనా. ఈ ఘటనపై విద్యార్థినులంతా కాలేజీ క్యాంపస్‌లో నిరసనకు దిగారు. దీంతో వర్సిటీ అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపాల్, రెక్టార్, ప్యూన్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అలాగే వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఇన్‌స్టిట్యూట్ ట్రస్టీ ప్రవీన్ పిండోరియా సోమవారం తెలిపారు.

ఈ ముగ్గురితో పాటు కాలేజీతో సంబంధం లేని మరో మహిళ అనిత వారికి సహకరించిందని, ఆమెపై కూడా కేసు నమోదు చేశామని భుజ్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తుకు మహిళా పోలీసులతో సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Related posts

బస్సుల్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు స్పర్శ దర్శనం టిక్కెట్లు

Satyam NEWS

కరోనా వైరస్ వ్యాప్తికి ఏ శిక్ష వేస్తారో తెలుసా?

Satyam NEWS

పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్లు జైలు శిక్ష‌

Satyam NEWS

Leave a Comment