31.7 C
Hyderabad
April 24, 2024 23: 33 PM
Slider ప్రపంచం

డ్రైవర్ లెస్ టైం సేఫ్: బుల్లెట్ రైల్ నిమిషాల్లో గమ్యం

bullet train driver less

బుల్లెట్​ రైలు అనగానే గుర్తొచ్చేది జపాన్​, చైనాలే. అయితే, ఇప్పుడు చైనా ఇంకో అడుగు ముందుకేసింది. డ్రైవర్​లెస్​ కార్లలాగే డ్రైవర్​ అవసరం లేని బుల్లెట్​ రైలును తయారు చేసింది. తయారు చేయడమే కాదు, పట్టాలపైకి ఎక్కించి పరుగులు పెట్టించింది. 2022 బీజింగ్​ ఒలింపిక్స్​కు కౌంట్​డౌన్​ కొనసాగుతున్న టైంలోనే చైనా ఈ రైలును ప్రారంభించింది.

గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ బుల్లెట్​ ట్రెయిన్​, డ్రాగన్​ కంట్రీ రాజధాని బీజింగ్​ నుంచి ఒలింపిక్స్​ జరిగే ఝాంగ్జియాకు సిటీకి పరుగులు పెడుతుంది. ఇప్పటిదాకా ఆ రెండు సిటీల మధ్య ప్రయాణ దూరం 3 గంటలు కాగా, ఈ బుల్లెట్​ రైలులో కేవలం 47 నిమిషాల్లోనే చేరుకోవచ్చట. డ్రైవర్​ లేని బుల్లెట్​ రైళ్లలో ఇదే ఫస్ట్​ అని చెబుతున్నారు. జింగ్​ఝాంగ్​ హై స్పీడ్​ రైల్వేస్​లో భాగంగా ఈ రైలును, రైల్వే లైన్​ను రెడీ చేశారు.

దానికి దాదాపు నాలుగేళ్లు పట్టిందట. బీజింగ్​, యాంఖింగ్, ఝాంగ్జియాకు రూట్లలో తిరుగుతుంది. గ్రేట్​ వాల్​ ఆఫ్​ చైనా ఉండే బదాలాంగ్​ చాంగ్​షెంగ్ ప్రాంతం సహా 10 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందట. డిసెంబర్​ 30నే దీని సర్వీస్​ ప్రారంభమైంది. బీజింగ్​ నార్త్​రైల్వే స్టేషన్​ నుంచి తైజీషెంగ్​ రైల్వేస్టేషన్​కు ఫస్ట్​ ట్రిప్పు వెళ్లింది. దీంట్లో టికెట్లు కావాలంటే రెండు రోజుల ముందే బుక్​ చేసుకోవాల్సి ఉంటుందట.

Related posts

దేశంలో ఏకైక నీతి వంత మైన నాయకుడు పవన్ కళ్యాణ్

Satyam NEWS

రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు

Satyam NEWS

సమ్మెలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు

Satyam NEWS

Leave a Comment