37.2 C
Hyderabad
April 19, 2024 14: 15 PM
Slider ప్రత్యేకం

హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న బర్మా దేశస్థుడి అరెస్టు

burma national

ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసుకుని అక్రమంగా భారత్ లో నివశిస్తున్న మయన్మార్ దేశస్థుడిని నేడు హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. రహీమ్ ఉల్లా అనే 34 ఏళ్ల బర్మా దేశస్థుడు పది సంవత్సరాల కిందట హైదరాబాద్ పాత బస్తీకి వచ్చాడు.

పాతబస్తీలోని బాబా నగర్ లోని బి బ్లాక్ లో అతను అక్రమంగా నివశిస్తున్నాడు. పోలీసు సమాచార వ్యవస్థ ద్వారా ఈ విషయాలను కంచన్ బాగ్ పోలీసులు తెలుసుకున్నారు.

దాంతో కంచన్ బాగ్ పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. అతడి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అక్కడ వారికి నకిలీ ఆధార్ కార్డు దొరికింది. అతని కుటుంబానికి కూడా ఆధార్ కార్డులు, ఓటరు ఐడి కార్డులు ఉన్నాయా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: సోషల్ డిస్టెన్సింగ్ ప్రస్తుత అవసరం

Satyam NEWS

డోల్ డ్రమ్స్: సిఏఏ దెబ్బకు పెట్టుబడులు హాంఫట్

Satyam NEWS

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో భారీ చోరీ

Satyam NEWS

Leave a Comment