35.2 C
Hyderabad
April 20, 2024 16: 20 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

కేసీఆర్ చెప్పినదే క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక

20190814_173439

ప్రస్తుతం ఉన్న సచీవాలయం పటిష్టంగా లేదని, పాలనకు అనుకూలం కాదని మంత్రివర్గ ఉప సంఘం తేల్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్న విధంగానే నివేదికను సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు: ప్రస్తుత భవన సముదాయంలోని ఎ,బి,సి,డి,జి, హెచ్ నార్త్, జె, కె బ్లాకుల్లో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే, దాన్ని ఆర్పడానికి అగ్రిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. మార్పులు చేసినప్పటికీ ఫైర్ ఇంజన్ పోవడం కుదరదు. గడిచన నాలుగు సంవత్సరాల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల సెక్రటేరియట్ ప్రస్తుత భవనాల్లో మూడు అగ్ని ప్రమాదాలు జరిగాయ.

చాలా భవనాలు 50-60 సంవత్సరాలు మాత్రమే వినియోగించడానికి వీలుగా డిజైన్ చేయబడ్డాయి. డి మరియు హెచ్ బ్లాకులు తప్ప, మిగతావన్నీ కాల పరిమితి ముగిసినవే. ఆర్.సి.సి. నిర్మాణాలు 50-60 సంవత్సరాలు మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంది. మంచినీటి పైపులు, విద్యుత్ వైర్ల జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు అప్పగించిన భవనాల్లో మంచినీటి పైపులు, విద్యుత్ పైర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని పునరుద్దరించడం కూడా సాధ్యం కాదు. ప్రస్తుతమున్న భవనాలను కొనసాగిస్తే, నిత్యం వాటిని మరమ్మతులు చేస్తూ ఉండాలి. మౌలిక వసతులు కూడా చాలా కాలం క్రితం ఏర్పాటు చేసినవి. పాత విద్యుత్ వైర్ల వల్ల ఎక్కువ విద్యుచ్ఛక్తి వినియోగం జరిగి,సంవత్సరానికి ఐదు కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. ప్రస్తుత సెక్రటేరియట్ లో కనీసం 150 మందితో సమావేశం పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ప్రస్తుత సెక్రటేరియట్ లో రిసెప్షన్ ప్లేస్ లేదు. విదేశీ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సెక్రటేరియట్ సందర్శించినప్పుడు వారికి స్వాగత ఏర్పాట్లు చేయడానికి అనువైన స్థలం లేదు. పైన పేర్కొన్న కారణాల నేపథ్యంలో ఇప్పుడున్న భవనానికి మార్పులు, చేర్పులు చేయడం సాధ్యం కాదు. కొత్త భవనం నిర్మించాలని నిపుణులు కమిటీ కూడా కోరింది. అగ్ని ప్రమాదాలను సులభంగా నివారించడానికి అనువుగా ఉండే, నేషనల్ బిల్డింగ్ కౌన్సిల్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేట్టు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచే విధంగా కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించాలని నిపుణుల కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నివేదిక సమర్పించింది. సచివాలయం తరలింపునకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవే విషయాలను చెప్పారు. ఆయన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలనే నిపుణుల కమిటీ, మంత్రివర్గ ఉఫ సంఘం మళ్లీ రాసి ఇచ్చినట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Bhavani

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Satyam NEWS

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

Leave a Comment