36.2 C
Hyderabad
April 23, 2024 20: 19 PM
Slider ముఖ్యంశాలు

న్యూ ఇన్ వెన్షన్ : ఇక క్యాన్సర్‌కు కీమోథెరపీ అవసరం లేదు

sri chitra

క్యాన్సర్ రోగులకు రాబోయే రోజుల్లో కీమోథెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. పసుపు నుంచి అభివృద్ధి పరచిన నూతన చికిత్సా విధానాన్ని కేరళకు చెందిన శ్రీ చిత్ర తిరునల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ రూపొందించింది. ఈ నూతన చికిత్సా విధానానికి అమెరికా నుంచి పేటెంట్ రైట్స్ ను శ్రీ చిత్ర పొందింది.

కొత్త టెక్నాలజీ ప్రకారం కీమోథెరపీ స్థానంలో ఉపయోగించే వీలున్నకర్కుమిన్ పొర చికిత్స సాంకేతికతను శ్రీ చిత్ర అభివృద్ధి చేసింది. డాక్టర్ లిస్సీ కృష్ణన్, శ్రీ చిత్రకు చెందిన డాక్టర్ లక్ష్మి నేతృత్వంలోని బృందం ఈ కొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి శస్త్రచికిత్స తర్వాత కీమోథెరపీ చేస్తారు.  కానీ క్యాన్సర్ కణాలతో బాటు సాధారణ కణాలు కూడా కీమోథెరపీ ద్వారా నాశనం అవుతాయి. 

ప్రత్యేకత ఏమిటంటే కర్కుమిన్ వాఫ్టింగ్ టెక్నాలజీ సాధారణ కణాలను చంపదు.  చట్టబద్ధమైన పరీక్షలు పూర్తి చేసిన రెండేళ్లలో చికిత్స ఆచరణాత్మకంగా లభిస్తుందని అంచనా. కర్కుమిన్ అనేది పసుపు నుంచి అభివృద్ధి పరుస్తారు. పసుపు నుంచి అభివృద్ధి పరచినందున రక్తం గడ్డకట్టడం సులభంగా జరుగుతుంది. అందువల్ల శస్త్ర చికిత్సలో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

Related posts

శ్రీ శ్రీ శ్రీ దేవీ దండుమారమ్మ ఆలయం వద్ద ఘనంగా అన్న సమారాధన

Satyam NEWS

రైతు వేదిక పనులను వేగవంతం చేయండి

Satyam NEWS

జోగులాంబ జాతర రాష్ట్రానికి ఆదర్శం కావాలి

Bhavani

Leave a Comment