32.2 C
Hyderabad
April 20, 2024 20: 00 PM
Slider ఖమ్మం

కేస్ స్టడీ: పోలీసులు నిర్లిప్తంగా మారితే ఏమౌతుంది?

khammam police

ఒక సంఘటనలో వచ్చిన తీవ్ర విమర్శలు ఖమ్మం పోలీసుల పనితీరుపై ప్రభావం చూపాయా? ప్రస్తుతం ఖమ్మం రోడ్లను పరిశీలిస్తే పోలీసుల పనితీరుపై ఆ సంఘటన ఎంత ప్రభావం చూపించిందో అర్ధం అవుతున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

లాక్ డౌన్ కన్నా ముందు ఒక రోజు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ అమలు చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో లాక్ డౌన్ సందర్భంగా రోడ్లపైకి విచ్చలవిడిగా యువకులు వచ్చేవారు.

బైక్ పై ఒక్కరే రావాలని చెప్పినా ముగ్గురు నలుగురు కలిసి రోడ్లపైకి వచ్చేవారు. పనిలేకపోయినా రోడ్లపైకి రావడం, పచార్లు చేయడం చాలా మందికి అలవాటైంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కరోనా సందర్భంగా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు.

దాంతో రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు చితక్కొట్టారు. బైక్ లపై త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని అడ్డుకున్నారు. లాఠీలు ఝుళిపించారు. దాంతో ఒక్క పూటలోనే ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ కంట్రోల్ అయింది. రోడ్లపైకి బలాదూర్ వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఇదే సమయంలో డ్యూటీకి వెళుతున్న ఒక డాక్టర్ ను ఏసిపి పి వి గణేష్ అడ్డుకున్నారని, ఆమెను కొట్టారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏసిపి గణేష్ తమకు క్షమాపణ చెప్పాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ఆ యువ డాక్టర్ ను తాము కొట్టలేదని, ఐడి కార్డు చూపించమని అడిగామని, స్టూడెంట్ అనుకుని కేవలం లాఠీతో భయపెట్టామని పోలీసులు వివరణ ఇచ్చినా ఎవరూ వినలేదు.

చివరకు ఏసీపీ గణేష్ ఆ డాక్టర్ కు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత శాఖా పరంగా ఆయనపై చర్య తీసుకున్నారు. ఆయనను విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన ఖమ్మం జిల్లా పోలీసులపై పెను ప్రభావం చూపింది.

అత్యంత సీనియర్ అధికారి, మరో ఏడాదిలో రిటైర్ మెంట్ ఉన్న గణేష్ కు ఎదురైన అనుభవంతో ఇప్పుడు ఖమ్మం పోలీసులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఖమ్మం రోడ్లపై ఇప్పుడు పనిలేని బ్యాచ్ స్వైర విహారం చేస్తున్నది. త్రిబుల్ రైడింగ్ సర్వ సాధారణం అయింది.

రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోయింది. ఖమ్మం పోలీసులు ఎవరిని కొట్టకుండా బతిమాలి చెబుతున్నారు. ఎవరూ వినడం లేదు. ఖమ్మం పోలీసులు పట్టించుకోవడం మానేశారు. కనీసం మాస్కులు, చేతి గ్లవుజులు కూడా లేకుండా ప్రాణాలు పణంగా పెట్టి ఎర్రని ఎండలో కరోనా లాక్ డౌన్ విధులు నిర్వర్తిస్తుంటే అభినందించాల్సి పోయి ఏసిపి గణేష్ కు జరిగిన అనుభవం వారిని నిర్లిప్తంగా మార్చేసింది.

Related posts

ఈశ్వరిపురి కాలనీ  సంక్షేమ సంఘం నూతన కమిటి ఎన్నిక

Satyam NEWS

గరుడ వాహనంపై సీతాపతి……

Satyam NEWS

బాబామెట్ట హజరత్ ఖాదర్ వలీ బాబా వారి ఆశ్ర‌మంలో ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

Leave a Comment