34.2 C
Hyderabad
April 19, 2024 21: 50 PM
Slider తెలంగాణ

తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్రం

kcr 28

దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల్లో వాటాను కేంద్రం నిర్ణయించి, బడ్జెట్ ద్వారా ప్రకటిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా ద్వారా 19,719 కోట్ల రూపాయలను అందివ్వనున్నట్లు కేంద్రం తన బడ్జెట్లో పేర్కొన్నది.

ఇది గత ఆర్థిక సంవత్సరమైన 2018-19లో కేటాయించిన రూ.18,560 కోట్ల కన్నా 6.2 శాతం అధికం. అయితే, గడిచిన ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ.10.304 కోట్ల రూపాయలు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ.10,528 కోట్లు.

అంటే నికరంగా చూస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 224 కోట్ల రూపాయలు తక్కువగా వచ్చింది. అంటే కేంద్ర బడ్జెట్లో సూచించిన లెక్కల ప్రకారం వాస్తవానికి 6.2 శాతం అధికంగా రావడం అటుంచి, 2.13 శాతం తగ్గింది.

అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే 700 కోట్లు అధికంగా రావాల్సిన నిధులు రాకపోగా, మరో 224 కోట్ల రూపాయలు తగ్గిపోవడంతో మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ.924 కోట్లు తగ్గింది. ఇదే విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ రావు ఇటీవల ఢిల్లీకి వెళ్లి తమకు కేంద్ర పన్నుల వాటాలో 8.3 శాతం తక్కువ వచ్చిందని కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చారు.

దీనివల్ల రాష్ట్రంలో అనేక పథకాలు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చిందని వివరించారు. దానికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వ అధికారులు పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయని, 8.3 శాతమే కాకుండా, ఇది మరింత తగ్గి 15 శాతానికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించారు.

గడిచిన ఎనిమిది మాసాలకు కేంద్ర పన్నుల వాటాలో 8.3 శాతం తగ్గిందని రాష్ట్ర అధికారులు మొర పెట్టుకుంటే, అది 15 శాతానికి తగ్గుతుందని కేంద్ర అధికారులు చెప్పారు. 15 శాతం తగ్గుదల అంటే మొత్తం ఏడాదికి కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2,957 కోట్లు తగ్గుతాయి.

Related posts

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

ముగ్గురు సోదరులను కాల్చి చంపిన వ్యక్తి

Satyam NEWS

What next: అందమైన ఉక్రెయిన్ ఛిద్రం… ఆర్ధికంగా రష్యా పతనం

Satyam NEWS

Leave a Comment