28.7 C
Hyderabad
April 20, 2024 07: 34 AM
Slider జాతీయం

హాఫ్ బట్:నిజామాబాద్‌లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ బోర్డు

central govt announce suganda dravyala board nijamabad

నిజామా బాడ్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది.తాము కోరుకున్న పసుపు బోర్డు స్థానే నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.తాము ఈ బోర్డును కేవలం పసుపు మిరప పంటలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ముదావహం.

తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పార్లమెంటులో ప్రకటించారు.పసుపు, మిరప పంటను దృష్టిలో పెట్టుకొనే నిజామాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు పీయూష్ గోయల్‌ తెలిపారు. ప్రస్తుతం అక్కడున్న డివిజినల్‌ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి అప్గ్రేడ్ చేస్తున్నట్లు గోయల్ తెలిపారు.

ఐఏఎస్‌ హోదా తో డైరెక్టర్‌ స్థాయి అధికారి ఈ ప్రాంతీయ కార్యాలయంలో కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతీయ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖకు పంటలపై నివేదిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు పీయూష్‌ గోయల్‌ వివరించారు.ఈ ప్రకటనతో ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా ప్రజల కల కొంత మేరకు నెరవేరినట్లయింది.

Related posts

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు

Satyam NEWS

ప్రాణాలు కాపాడే ప్రత్యక్ష దైవాలు మన డాక్టర్లు

Satyam NEWS

కాళేశ్వరం జలాలతో కరీంనగర్ సస్యశ్యామలం

Bhavani

Leave a Comment