39.2 C
Hyderabad
March 29, 2024 14: 41 PM
Slider ఆధ్యాత్మికం

రేపు తిరుమలలో చ‌క్ర‌తీర్థ ముక్కోటి

tirumala 27

తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాల‌లో ఒక్క‌టైన చక్రతీర్థ ముక్కోటి డిసెంబ‌రు 9న సోమ‌వారం ఘనంగా జరుగనుంది. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరుల మీద దక్షిణ భాగంలో మహా పవిత్ర తీర్థమైన చక్రతీర్థం ఉంది. ప్రతి ఏడాది తమిళ కార్తీక మాసం శుద్ధ ద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది.

ఆ రోజున ఉద‌యం 9.00 గంట‌ల‌కు స్వామివారు అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు మరియు యాత్రికులు మంగళవాయిద్యాలతో స్వామివారు ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు పూజ‌లు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు.

అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మ‌హావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు.

అటు తరువాత ఆ మహర్షి  శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్ర‌ముఖ తీర్థంగా వెలుగొందుతోంది.

Related posts

కొత్త‌ జిల్లా ఏర్పాటు ఉన్న‌ప్ప‌టికీ విజయనగరం జిల్లా కేంద్రంలోనే ఉగాది వేడుక‌లు

Satyam NEWS

మాణిక్యాలరావుపై అసత్య ప్రచారం

Satyam NEWS

భారత సైనికులకు ప్రాణాంతకంగా మారిన మంచు కొండ చరియలు

Satyam NEWS

Leave a Comment