39.2 C
Hyderabad
March 28, 2024 14: 15 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ముఖ్యంశాలు

అమెరికా వెళ్తున్నావా?వెళ్లిరా, ఆరోగ్యమస్తు

pjimage (6)

ఈ తెలుగుదేశానికి ఏమైంది? ఒకరికి వంటి నొప్పి… మరొకరికి పంటి నొప్పి… చిన్న నొప్పులకు కూడా విదేశాలకే వెళ్తున్నారు? ఎందుకు? ఏం జరుగుతున్నది? వామ్మో క్వశ్చన్లు ఆపి ఆన్సర్లు చెబుతారా? లేదా? చెబుతా ఉండండి. మీరు గమనించారో లేదో ఆరోగ్య పరీక్షల పేరుతో ఈ మధ్య కాలంలో ఇద్దరు తెలుగుదేశం ముఖ్య నేతలు విదేశాలకు వెళ్లి వచ్చారు… ఒకరైతే ఇంకా రాలేదు అక్కడే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వేరే నాయకులైతే ఫర్లేదు సాక్ష్యాత్తూ ఆ పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబునాయుడు అకస్మాత్తుగా ఎవరికి ముందుగా చెప్పకుండా అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రానికి వెళ్లివచ్చారు. ఏమిటి సంగతి అంటే –ఆరోగ్య పరీక్షలు అన్నారు. ఆరోగ్య పరీక్షలే చేయించుకోవాలంటే హైదరాబాద్ ఉంది కదా? పోనీ హైదరాబాద్ కాకపోతే ఢిల్లీ రాజధానిలో ఎయిమ్స్ లాంటి మెడికల్ సంస్థలు ఉన్నాయి కదా? మిన్నసోటా వెళ్లడం ఏమిటి? కేవలం నాలుగు రోజులు మాత్రమే అక్కడ ఉండి అక్కడ వ్యాహ్యాళికి వెళ్లి నట్లు పేపర్లలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఏమిటి? మిన్నసోటాలో మా నాయకుడు ఎంతో సంతోషంగా ఉన్నారు చూడండి అంటూ చంద్రబాబు పల్లీలు తింటున్న వీడియోను వైరల్ చేయడం ఏమిటి? భార్యతో కలిసి ఎంచక్కా టీ తాగుతున్నారు చూడండి అంటూ ఫొటోలు విడుదల చేయడం ఏమిటి? తిరిగి వచ్చిన తర్వాత మిన్నసోటా ఎందుకు వెళ్లి వచ్చారో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటో పబ్లిక్ కు చెప్పకపోవడం ఏమిటి? అసలు ఏం జరిగుతున్నది అనేది పెద్ద ప్రశ్న. ఎవరైనా పెద్ద నాయకులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే విదేశాలకు వెళ్తారు- గోప్యత – కోసం. హైదరాబాద్ లో చేయించుకుంటే వారికి ఏం వ్యాధి వచ్చిందో ఒక్క సారిగా గుప్పుమంటుంది. అలా జరగడం ప్రభుత్వాలకు, పార్టీలకు మంచిది కాదు అందుకోసం విదేశాలకు వెళతారు. అక్కడ నుంచి సమాచారం వచ్చే వీలు ఉండదు కాబట్టి సర్దుకునే వ్యాధి అయితే సర్దుకుంటారు. లేకపోతే ప్రభుత్వాన్ని పార్టీని సొంత ఆస్తులను సర్దుకుంటారు. ఎవరైనా ఇదే చేసేది. మరి చంద్రబాబు ఆరోగ్యంపై మిన్నసోటాలో ఏం పరీక్షలు చేశారు? రిపోర్టులలో ఏముంది? ఆ విషయం ఎవరికి తెలిసే అవకాశం లేదు. -సత్యం న్యూస్- తెలిసిన వారు చెప్పేందుకు అంతకన్నా అవకాశం లేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితి పై అందరూ గుంభనంగా ఉన్నారు. మిన్నసోటా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కార్యకర్తలతో మాట్లాడారు. ఎందో ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నారు. 100 ఏళ్లు దాటిన సీనియర్ మోస్టు తెలుగుదేశం పార్టీ నాయకుడు యడ్లపాటి వెంకటరావును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆందోళన లేకుండా ఉండటం వల్లే ఆయన వందేళ్లకు పైగా బతుకుతూనే ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రం కొండలు లోయలు ఎక్కువగా ఉండే ప్రాంతం. అక్కడ పెద్దగా చూడదగిన ప్రాంతాలు (టూరిస్టు ఎట్రాక్షన్స్ ) కూడా లేవు. అయితే అక్కడ వైద్య రంగానికి సంబంధించి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి, గుండె సంబంధ వ్యాధులు, స్థూల కాయం తదితర వ్యాధులపై అక్కడ ప్రత్యేక చికిత్స ఉంటుంది. బయోకెమిస్ట్రి, మెడికల్ జీనోమిక్స్ (జీన్స్ కు సంబంధించిన పరిశోధనలు) కూడా అక్కడ చేస్తుంటారు. ఈ సంస్థకు చంద్రబాబు వైద్యం కోసం లేదా వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలిసే అవకాశం లేదు. పచ్చ పత్రికలు చంద్రబాబు మిన్నసోటా పర్యటనను పెద్దగా రిపోర్టు చేయలేదు. ఏం జరిగిందో ఆయా పత్రికల అధిపతులకు తెలుసేమో కానీ పాఠకులకు చెప్పలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ముఖ్య నాయకుడు యనమల రామక్రుష్ణుడు. విచిత్రంగా ఆయన పంటి నొప్పితో గత 15 – 20 రోజులుగా సింగపూర్ లో చికిత్స చేయించుకుంటున్నారు. పంటి నొప్పికి సింగపూర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఆయన వెళ్లారు. 20 రోజులు అవుతున్నా కబురూ లేదు కాకరకాయా లేదు. పచ్చ పత్రికలు యనమల రామక్రుష్ణుడు ఎక్కడకు వెళ్లారో చెప్పడం లేదు. నిజంగా పంటి నొప్పేనా మరేదైనా కారణం ఉందా అని ఆయన అభిమానులు కొందరు ఆందోళన చెందుతున్నారు…. సమాచారం లేదు…

Related posts

ప్రజాఉపయోగానికి ఖర్చు చేయాల్సిన నిధులు చర్చికి ఇస్తారా?

Satyam NEWS

60 సంవత్సరాలుగా సాధ్యం కాని సమస్యపై విజయం

Satyam NEWS

ఏపీ రాజధాని అంశంపై అక్టోబర్‌ 5 వరకు స్టేటస్‌కో

Satyam NEWS

Leave a Comment