39.2 C
Hyderabad
March 29, 2024 15: 57 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

చెత్తపలుకు: కాశ్మీర్ టు కియా మోటార్స్

pjimage (9)

చిన్నప్పుడు మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడికి ఆవు మీద వ్యాసం తప్ప మరేం వచ్చేది కాదు. అంతరిక్షంపై వ్యాసం రాయమన్నా ఆవుతో లింకు పెట్టేవాడు. అంతరిక్షం అంటే అ తో స్టార్ట్ అవుతుంది. అ తర్వాత వచ్చే అక్షరం ఆ. ఆ అంటే ఆవు.. ఆవుకు నాలుగు కాళ్లు ఉండును.. ఆవు పాలిచ్చును… అని.. ఇలా… రాసేవాడు. అలాగే చెత్తపలుకు రైటర్ కు కూడా జమ్మూ కాశ్మీర్ విషయం రాయాల్సి వచ్చినా ఆంధ్రప్రదేశ్, అందులో అధికారంలో ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన పాలన లాంటి విషయాలే గుర్తుకు వస్తుంటాయి. జమ్మూ కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు లాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంతో ప్రధాని నరేంద్రమోడీ పరపతి రెండు తెలుగు రాష్ట్రాలలో అమాంతం పెరిగిపోయిందట. మోడీ పరపతి ఇప్పుడు పెరిగేదేమిటి? సిబి నాయుడు అధికారంలో ఉండి, బిజెపిని ప్రధాని నరేంద్రమోడీని ఆంధ్రప్రదేశ్ కు విలన్ ను చేసినా ప్రజలు నమ్మలేదు. మోడీ కేసీ ర్, జగన్ ఒక్కటే అని సిబి నాయుడు నెత్తీ నోరూ బాదుకుని మరీ ప్రచారం చేశాడు. పచ్చ మీడియా ఇదే విషయాన్ని బ్యానర్ ఐటమ్ లు వేసి మరీ ప్రచారం చేసింది. అయినా తెలుగు ఓటరు ఆంధ్రప్రదేశ్ లో జగన్ నే సి ఎం చేశారు తప్ప సిబి నాయుడికి ఒటు కూడా వేయలేదు. 23 సీట్లతో సరిపెట్టారు చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు. అంటే మోడీ పరపతి ఎప్పటి నుంచో ఉన్నట్లే కదా? ఈ లాజిక్కు చెత్త పలుకు మర్చిపోయి ఇప్పుడు మోడీ పరపతి పెరిగినట్లు, దానివల్ల జగన్ కు కేసీ ఆర్ కు ఇబ్బంది ఉన్నట్లు రాస్తున్నాడు. ఇబ్బంది వచ్చింది సిబి నాయుడికి. మోడీకి ఇప్పుడు ఎంత ప్లస్ అయితే సిబి నాయుడికి అంత మైనస్. ఇదీ ఈక్వేషన్ సోదరా, పచ్చ కళ్లద్దాలు తీసి చూడు. మోకాలికి బోడి గుండుకు ముడి వేయడం అంటే అది ఎలా చేస్తారా అని ఆలోచించేవాడిని. ఈ వారం చెత్త పలుకు చదవితే అది అర్ధం అయింది. చెత్త పలుకు సోదరుడు ఆ పని చేశాడు. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతూ అమిత్ షా చెప్పాడట. ఏమని? జమ్మూ కాశ్మీర్లో దేశ ప్రజలందరికి హక్కులు ఉంటాయని. ఇది చెప్పిన రెండు రోజులకే ఈ భూమి మాది, నీరు మాది, శ్రమ మాది అందుకోసం ఉద్యోగాలు మాకే దక్కాలి అని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి గోరంట్ల మాధవ్ చెప్పాడట. ఇలా చెబుతాడా ఇలా చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు వస్తాయా? అంటూ చెత్త పలుకు కపట ప్రేమ ఒలక బోస్తున్నది. ఇలానే చెబుతారు బ్రదర్. స్థానికులను కాదని వారిని పక్కన పెట్టి, కియా మోటార్ ప్రాంతం అంతా చైనా జపాన్ భాషల్లోనే బోర్డులు పెట్టి, స్థానికులను దగ్గరకు రానివ్వకుండా, వారికి కనీసపు కూలి పనులు కూడా ఇవ్వకుండా కోట్లాది రూపాయలతో ఫ్యాక్టరీలు పెట్టించడం సిబి నాయుడికి సరదా. ఆ సరదా అందరికి ఉండదు సోదరా, ఉండదు. మా ఉద్యోగాలు మాకు కావాలి అని కోరడం తప్పెలా అవుతుందో మనకు అర్ధం కాదు. ఇది తప్పట. శివసేన కూడా ఇలానే చేస్తుందట. ఆహా ఏం నాలెడ్జి? ఇలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చేస్తున్నాడట. మనం దాన్ని విమర్శిస్తున్నాం కదా మరి గోరంట్ల మాధవ్ అలా మాట్లాడటమేమిటి అని చెత్త పలుకు ప్రశ్నిస్తుంది. …. అదే చెప్పాను కదా ఆవు మీద వ్యాసం…. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయట. పాపం చెత్త పలుకు బ్రదర్ కు అన్నీ ఇలాంటి పీడకలలే వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారా లేదా అని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారట. ఆహా ఇదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనలో మార్పు వచ్చినట్లే. స్థానికులు ఎంతో సంతోషిస్తారు. ఇప్పటి వరకూ ఈ పని చేయని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే వారు కూడా తమ తమ ప్రాంతాల్లోని యాజమానులను స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వమని డిమాండ్ చేయండి. ఈ ఒక్కటి చేస్తే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఆకాంక్షలన్నీ నెరవేరుతాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులు అన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయట. అక్కడేదో లక్షల కోట్లు వచ్చేసినట్లు. మచిలీపట్నం పోర్టు పనుల విషయంలో ఉన్న కాంట్రాక్టును రద్దు చేయడం కూడా అతి పెద్ద తప్పిదంగా చెత్త పలుకు కు కనిపించింది. వారంతా కోర్టుకు వెళ్లాలని, అక్కడ పనులన్నీ ఆగిపోవాలని ఆశిస్తూ చెత్తపలుకులో కుమ్మేస్తున్నాడు. రాజధాని భూముల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన తెలుగుదేశం పార్టీ బాటలోనే జగన్ కూడా నడవాలని చెత్తపలుకు బలంగా కోరుతున్నది. కాంట్రాక్టులు రద్దు చేయడం, పిపి ఏలను తిరగదోడటం కూడా పాపం ఈ సామాజిక వర్గానికి మింగుడు పడటం లేదు. జగన్ కు ఓట్లు వేసిన వాళ్లు పశ్చాత్తాప పడతారని కూడా చెత్తపలుకు జోస్యం చెబుతున్నది. సిబి నాయుడు రెండు రోజుల కిందటే చెప్పాడు కదా ఇదే విషయం. ఇప్పుడు చెత్త పలుకు కూడా చిలక లాగా అదే పలుకులు పలుకుతుంది. ఒక సామాజిక వర్గాన్ని ఛీదరించుకునేలా చేసింది ఇలాంటి మాటలే, చేష్టలే. కొండెక్కి ఏడ్వడం కాదు. కిందికి వచ్చి ఇప్పటికైనా ప్రజలతో కలిసి పని చేయడం తెలుగుదేశం పార్టీ నేర్చుకోవాలి. చెత్తపలుకు రాసే లాంటి వాళ్లు సలహాలు వింటున్నంత కాలం తెలుగుదేశం పార్టీ మార్పు తెచ్చుకోవడం కష్టమే. సిబి నాయుడికి మళ్లీ అధికారం దక్కడం కష్టమే. చెత్తపలుకును ఇప్పటికైనా వదిలించుకోవడం సిబి నాయుడి చేతుల్లోనే ఉంది.

Related posts

దోచుకోవడం,దాచుకోవడమే కల్వకుంట్ల కుటుంబ ప్రత్యేకత

Bhavani

తైక్వాండో విజేతలను అభినందించిన ములుగు అడిషనల్ డిసిపి సాయి చైతన్య

Satyam NEWS

జనతా కర్ఫ్యూ పాటిస్తున్న మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment