40.2 C
Hyderabad
April 19, 2024 15: 15 PM
Slider మెదక్

తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వకపోతే రూ.500 జరిమానా

harish 26

ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది.! మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ! మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత భావం ఉండాలి. జరిమానా వేయకపోతే భయం ఉండదు.!  ప్రతి ఇంటింటికీ తడి, పొడి రెండు చెత్త బుట్టలు ఇస్తున్నాం.! ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వకపోతే జరిమానా వేయక తప్పదు.!

ఖాళీ ప్లాట్ స్థలంలో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తాం ! ప్రజల సహకారం లేనిదే సిద్ధిపేట పట్టణం ప్రగతి సాధించదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట జిల్లా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్ధిపేట పరిధిలో బుధవారం ఉదయం జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజంబీల్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి 30వ, 20వ వార్డుల్లో మంత్రి పర్యటించారు.

ముందుగా 30వ వార్డు పరిధిలోని దాదాపు 16 గల్లీల్లో తిరిగారు. ఓపెన్ ప్లాట్లలో చెత్త చెదారం వేయడంతో డంప్ యార్డు తరహాలో తయారైందని, అడుగడుగునా చెత్త కనిపించడంతో మున్సిపల్ అధికారుల తీరుపై మంత్రి అగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ ఇవ్వడం లేదని, దోమల వల్ల ఇబ్బంది పడుతున్నామని  కాలనీ వాసులు మంత్రికి విన్నవించారు.

ఈ మేరకు మంత్రి ప్రతి స్పందిస్తూ పది రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఖాళీ ప్లాట్ స్థలంలో చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని, అలాగే ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా మున్సిపాలిటీకి తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి సహకరించని వారికి కూడా రూ.500 జరిమానా విధించే యోచనలో మున్సిపాలిటీ ఉన్నదని చెప్పారు.

పట్టణంలో మున్సిపాలిటీ తరపున వారంలో రెండు రోజులు పొడి చెత్త సేకరిస్తామని, తడి చెత్త ప్రతి రోజూ సేకరిస్తామని స్పష్టం చేశారు. ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త వేయాలని, ఈ చెత్త మళ్లీ ఎరువుగా మారి మట్టిలో కలిసి పోతుందని, నీలం రంగు బుట్టలో పొడి చెత్త వేయాలని కోరారు.

స్మశాన వాటికలను పార్క్ తరహాలో చేశామని, కోమటి చెరువు సుందరీకరణ, ఎర్ర చెరువును కోమటి చెరువు తరహాలో చేయనున్నామని పట్టణ అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. 58, 59జీఓ కింద దరఖాస్తుకు గడువు పొడగింపు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని, ఇదే చివరి అవకాశం పోగొట్టుకోవద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు. 58, 59జీఓ కింద దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగు రోజుల్లో పట్టాలు ఇవ్వాలని అర్బన్ తహశీల్దారును మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ లక్ష్మణ్, పబ్లిక్ హెల్త్ ఈఈ వీర ప్రతాప్, డీఈ గోపాల్, మున్సిపల్ శాఖ వివిధ విభాగాల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రొటెస్టు: వైసీపీ ఎన్నికల అరాచకాలపై అఖిలపక్షం ధర్నా

Satyam NEWS

అంకితా భండారీ మృతదేహం వెలికితీత

Satyam NEWS

వనపర్తిలో స్కానింగ్ సెంటర్ లను తనిఖీ చేసిన వైద్య శాఖ

Satyam NEWS

Leave a Comment