28.2 C
Hyderabad
April 20, 2024 11: 07 AM
Slider కరీంనగర్

ఫెస్టివల్:అభివృద్ధి ప్రదాత ఉద్యమ నేత కెసిఆర్

cm kcr birth day celebrations grandly vemulaw

వేములవాడ పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు నేతృత్వం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయిన మహిళలకు కేసీఆర్ కిట్ తో పాటు పండ్లను అందించి ఎం.డి.ఓ ఆఫీస్ నందు మొక్కలు నాటి, మరియు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ వారంతా పండుగ వాతావరణం సృష్టించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పటి ఉద్యమనేత, రథసారథి ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దశాబ్దాల కలను నెరవేర్చిన కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గంలో దాదాపు 40వేల ఎకరాలకు సాగునీరు అందించాం, మల్కపేట రిజర్వాయర్ మరియు కలికోట సూరమ్మ చెరువు ద్వారా మిగిలిన 60వేల ఎకరాలకు సాగునీరు సాగునీరు అందించబోతున్నాం.

వేములవాడ పట్టణం మరియు దేవాలయం కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 500కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. దేవాలయానికి 5కోట్లతో సాంస్కృతిక, సంగీత, నృత్య, వేద పాఠశాలను తీసుకురాబోతున్నామని అన్నారు. మల్కపేట రిజర్వాయర్ ద్వారా వేములవాడ మూలవాగు జీవనదిగా మారబోతున్నదని అన్నారు. వేములవాడ నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, రవాణా, ఉపాధి, సాగునీరు, త్రాగునీరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం.

రైతులను ముఖచిత్రం పైకి తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఋణపడి ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కుఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి , వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ , జెడ్.పి.టి.సీలు, ఎం.పి.పిలు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి

Bhavani

ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆకస్మిక బదిలీ

Satyam NEWS

టెక్నికల్ విజిల్: నిర్మల్ ఆటోలకు క్యూఆర్ కోడ్

Satyam NEWS

Leave a Comment