33.2 C
Hyderabad
April 26, 2024 01: 52 AM
Slider ఆదిలాబాద్

గో గ్రీన్: ప్రతి గ్రామంలో నర్సరీ పనులు పూర్తి చేయాలి

collector prashanthi

నిర్మల్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో శనివారం లోగా నర్సరీ ఏర్పాటు పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి మండల అభివృద్ధి అధికారులు ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి లో భాగంగా నర్సరీల ఏర్పాటు కోసం బ్యాగులో మట్టి నింపే కార్యక్రమం, డంపింగ్ యార్డ్ స్మశానవాటిక కోసం అటవీ భూముల సేకరణ, మొక్కల సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం పనులపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలనే గ్రామ పంచాయతీకి పంపించిన విత్తనాలను, కూలీలతో బ్యాగులో మట్టిని నింపే పనులు త్వరగా పూర్తి చేసి వాటిలో విత్తనాలను తొందరగా విత్తితే మొలకలు వచ్చి హరిత హారం నిర్వహించే సమయానికి మొక్కలు అందుతాయని అన్నారు. శనివారం లోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. నర్సరీలలో పెరుగుతున్న మొక్కల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోని వాటి సంరక్షణ కు కృషి చేయాలన్నారు.

పెంబి, సారంగాపూర్ మండలం లోని గ్రామాలకు స్మశాన వాటికలు డంపింగ్ యార్డ్  కోసం సంబంధిత గ్రామాల రెవెన్యూ, పంచాయతీరాజ్ కార్యదర్శులు అటవీ భూముల కోసం అండర్ టేకింగ్ ధృవ పత్రాలను అటవీశాఖకు ఇవ్వాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలన్నారు. మండల పరిధి సూచించే బోర్డులను మొదలు, చివర  పెట్టాలని, మండల హెడ్క్వార్టర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.

మండల ప్రధాన రహదారులపై చెత్తాచెదారం లేకుండా, ప్లాస్టిక్ లేకుండా చూడాలన్నారు. మండల మెయిన్ రోడ్డు అద్దంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె భాస్కర్ రావు, జిల్లా అటవీ అధికారి డాక్టర్ సుధాన, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎఫ్ డి ఓ గోపాల్ రెడ్డి, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా టెస్టు

Satyam NEWS

శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ బ్రాహ్మణ సత్రంలో వసంత పంచమి

Satyam NEWS

బ్రాహ్మణులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం

Bhavani

Leave a Comment