32.7 C
Hyderabad
March 29, 2024 12: 17 PM
Slider చిత్తూరు

తిరుమల ఘాట్ రోడ్లపై కనువిందు చేస్తున్న జింకలు

tirumala ghat road

కరోనా ఎఫెక్ట్ తో తిరుమల ఘాట్ రోడ్లు మూతపడటం వన్య ప్రాణులకు పండుగ లా మారింది. గత నాలుగైదు రోజులుగా తిరుమల ఘాట్ రోడ్లలో జన సంచారం లేని పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. దేవదేవుడి దర్శనాలు నిలిపివేయడంతో తిరుమలకు వచ్చే వారు లేకుండా పోయారు. తిరుమల నడక మార్గం మొత్తం జింకల పార్కు ఉంటుంది. ఆ పార్కు నుంచి అప్పుడప్పుడు కొన్ని జింకలు రోడ్లపైకి వచ్చేవి. అయితే ఇప్పుడు జింకలు పార్కులో కన్నా ఎక్కువగా రోడ్డు పైనే ఉంటున్నాయి.

యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈరోజు ఉదయం తిరుమల లోని మొదటి ఘాట్ రోడ్డులో కనిపించిన దృశ్యం ఇది. గత నాలుగు రోజుల నుంచి ఒక చిన్న శబ్దం, బస్సు, కార్లు, స్కూటర్ లాంటి వాహనాల సౌండ్ లేకపోయేసరికి సాధు జీవులు జింకలు రోడ్డు మీద ప్రశాంతంగా నీటి కోసం, ఆహారం కోసం వచ్చేస్తున్నాయి. వందేళ్ల తర్వాత అడవిలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్న రోజులు ఇవేమో అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తున్నది.

Related posts

20 న జలిజపల్లె గంగమ్మ జాతర

Satyam NEWS

నాడు మొక్క‌- నేడు చెట్టు: 2015 లో మామ‌డలో మొక్క‌ నాటిన సీయం కేసీఆర్

Satyam NEWS

విద్యార్థుల ప్రాణాలతో సీఎం కేసీఆర్ చెలగాటం

Satyam NEWS

Leave a Comment