34.2 C
Hyderabad
April 19, 2024 20: 30 PM
Slider శ్రీకాకుళం

కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

srikakualm ration

కరోనా  మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న లాక్ డౌన్ కు  ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని శ్రీకాకుళం పట్టణం 24వ డివిజన్  మహాలక్ష్మి నగర్ కాలనీ వైసీపీ యువ నాయకుడు రౌతు సూర్య నారాయణ కోరారు.

ఈ మేరకు సోమవారం ఆ డివిజన్ లో వాలంటీర్లు తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పద్మావతి, యువ నాయకులు మెంటాడ స్వరూప్  పిలుపు మేరకు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల్లో కరోనా  పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం ఈనెల 29 నుంచి ఇంటింటికి నిత్యావసర సరుకుల ను ఉచితంగా అందచేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు బియ్యం, కంది పప్పుతో పాటు చక్కెర పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రజలందరూ కరోనా పై అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని జిల్లా యంత్రాంగానికి పోలీసులకు  సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ సువారి సునీత కింతలి మణికంఠ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు కిల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సుమన్ టీవీ ఆరేళ్ళ అద్భుత ప్రస్థానం

Satyam NEWS

ప్రవేశ పరీక్ష ల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

వలస కార్మికులకు ఉచితంగా బియ్యం, నగదు పంపిణీ

Satyam NEWS

Leave a Comment