40.2 C
Hyderabad
April 24, 2024 18: 44 PM
Slider జాతీయం

ప్లానింగ్: హామీల అమలుపై అధికారులతో కేజ్రీ

arvind-kejriwal

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తనను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు ప్రారంభించారు. శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆయన ఈ మేరకు బుధవారం ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనధికార కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పన, చెత్త రహిత ఢిల్లీ, అంతరాయం లేని విద్యుత్‌ సరఫరాతో సహా తాను ఇచ్చిన 10 హామీల అమలుపై ఈ సందర్భంగా చర్చిస్తారు.

సమాజంలోని వేర్వేరు వర్గాలకు పైపుల ద్వారా తాగునీరు, ప్రతి చిన్నారికి విద్య, ఉచిత బస్సు ప్రయాణ పథకం, ఆరోగ్య రక్షణ సదుపాయాలు, మహిళా భద్రత, యమునా నది శుభ్రం చేసే కార్యక్రమం వంటి అంశాలు అజెండాగా బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరగనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌ ఆదివారం ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలోని వేర్వేరు విభాగాల ఉన్నతాధికారులతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి

Related posts

కరోనా ఇబ్బందులు చెప్పేవారిపై కేసులు పెడితే ఊరుకోం

Satyam NEWS

పైసా ఖర్చు లేని బదిలీలను వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Satyam NEWS

నీలి విప్లవంతో వెలుగులు  

Murali Krishna

Leave a Comment