27.9 C
Hyderabad
April 16, 2024 10: 16 AM
Slider ప్రపంచం ముఖ్యంశాలు

హౌడీ మోడీపై వాణిజ్య వర్గాల ఆశలు

modi trump

గత ఏడాది అమెరికా- భారత్ మధ్య జరిగిన వాణిజ్యం విలువ 142 బిలియన్ డాలర్లు. అదే అమెరికా చైనా మధ్య జరిగిన వాణిజ్యం విలువ 737 బిలియన్ డాలర్లు. ఇప్పుడు చైనా వాణిజ్యాన్ని తగ్గించి భారత్ తో వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెంచుకోవాలని అమెరికా ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా హౌడీ మోడీ లో పెద్ద ఎత్తున వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకోవాలని అమెరికా భావిస్తున్నది.

ఈ మేరకు ఇప్పటికే పెద్ద కంపెనీలను అమెరికా సిద్ధం చేసుకున్నది. అయితే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అడ్డు రాని విధంగానే వాణిజ్య విధానాలు ఉండాలని భారత్ కోరుతున్నందున ఆ మేరకు అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో అమెరికన్ పాలకులు అడ్డగోలుగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుని అమెరికాలో ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించి అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ కామర్స్ లో పెట్టుబడుల నిబంధనలు కఠిన తరం చేసినందున ఆన్ లైన్ వ్యాపారం చేసే ఫ్లిప్ కార్ట్, వాల్ మార్ట్, అమెజాన్ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి.

2027 నాటికి 200 బిలియన్ డాలర్ల వ్యాపారానికి చేరుకోవాలని చూస్తున్న ఆన్ లైన్ మార్కెట్ కంపెనీలకు కొన్ని ఆంక్షలు మింగుడు పడటం లేదు. ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా అమెరికా తన ప్రతిపాదనలను భారత్ ముందు ఉంచే అవకాశం కనిపిస్తున్నది. అమెరికా నిర్ణయించిన రేట్లను అంగీకరించే విధంగా జపాన్ ను ఇప్పటికే ఒప్పించిన అమెరికా ఆ దేశ ప్రధాని షింజో అబే తో వచ్చే వారం అంగీకారం కుదుర్చుకోబోతున్నది. అదే విధంగా భారత్ తో కూడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అమెరికా తహతహ లాడుతున్నది. రేట్ విషయంలో భారత్ అంగీకరిస్తే భారత్ నుంచి ఎగుమతుల జాబితాను పెంచేందుకు అమెరికా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నది.

దిగుమతుల విషయంలో కొంచెం కఠినంగా ఉండి మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మోడీ చేస్తున్న ప్రయత్నాలను కూడా అమెరికా పరిగణనలోకి తీసుకుంటున్నది. యాపిల్ ఇన్ కార్పొరేషన్ కు సరఫరా దారుడైన ఫాక్స్కాన్ ఇటీవల చైనా సప్లై చైన్ నుంచి బయటకువచ్చేందుకు ఇటీవల భారత్ లోనే ఐఫోన్ ల తయారీని ప్రారంభించింది. దీని వల్ల 20 శాతం ఇంపోర్టు టారిఫ్ నుంచి ఫాక్స్కాన్ తప్పించుకుంది. ఇదే విధమైన ఫలితాలను భారత్ అమెరికా నుంచి కూడా ఆశిస్తున్నది.

భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే రసాయనాలు, ప్లాస్టిక్, లెదర్ గూడ్స్, రబ్బర్ వస్తువులు, ఆటో పార్టులను అమెరికా కొన్ని ఆంక్షల నుంచి జూన్ లో మినహాయింపు ఇచ్చింది. అదే విధంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్మండ్స్, యాపిల్స్, వాల్నట్స్ పై భారత్ అదే విధమైన మినహాయింపులు ఇచ్చింది. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో సాగితే హౌడీ మోడీ లో అతి పెద్ద వాణిజ్య ఒప్పందం అమెరికా భారత్ మధ్య కుదిరే అవకాశం కనిపిస్తున్నది.

Related posts

ట్రూ అప్ చార్జీలు రద్దు చేయకపోతే పోరాటం తీవ్రం చేస్తాం

Satyam NEWS

అర్హులైన ముస్లిం సోదరులకు దుకాణాలు కేటాయించాలి

Satyam NEWS

గ్రూపు రాజకీయాల నుంచి కాంగ్రెస్ గట్టెక్కేనా

Satyam NEWS

Leave a Comment