27.7 C
Hyderabad
March 29, 2024 03: 34 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవడానికి మార్గాలు

thD47TS12Q

తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఎంత భక్తితో తిరుమల చేరుకుంటామో దర్శనం కోసం అంతే ఆందోళన చెందుతాం. ఏడు రకాల దర్శనాలున్నా కూడా స్వామి దర్శనం కష్టమే అవుతుంది. అయితే ఎటువంటి సిఫారస్సు లేకుండా, పైసా డబ్బు వెచ్చించకుండా స్వామిని సులభం దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాటిని తెలుసుకోవడమే మనం చేయాల్సిన పని. కాలినడక తిరుమలకు వెళ్ళే వారు కూడా కొన్ని గంటల సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి దర్శనం, వృద్దులు, వికలాంగులకు కలిగించే దర్శనాలు ప్రత్యేక కోటా కిందకు వచ్చే దర్శనాలవుతాయి. ఇవి కాకుండా సర్వదర్శన కోటాలోనే స్వామిని సులువు దర్శనం చేసుకోవడానికి ఉండే మార్గం ఏమిటి ? అంటే ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన స్లాట్ విధానం. ఎక్కడెక్కడి నుంచో తిరుమల వెళ్ళడానికి భక్తులు తిరుపతి చేరుకుని నేరుగా తిరుమలకు ప్రయాణమవుతారు. లేకపోతే దర్శనం ఆలస్యమవుతుందనే భయం. అందుకే పరుగు పరుగున అక్కడకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోకి చేరుతారు. అంత ఆందోళన పడాల్సిన పని లేదు. ప్రయాణీకులు తిరుపతిలోనే దర్శనానికి స్లాట్ బుక్ చేసుకునే విధానం అమల్లో ఉంది. స్లాట్ బుకింగ్ కేంద్రాలు తిరుపతిలోని ఏడు కొండలు బస్టాండు, బాలాజీ బస్టాండు సమీపంలో వసతి గృహాలలో ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అదే విధంగా రైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తుల కోసం విష్ణు నివాసం, బస్టాండు సమీపంలోని శ్రీనివాసం వసతిగృహాలలో వీటిని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు చూపితే చాలు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్‌పై మీకు దర్శన సమయం కేటాయించబడి ఉంటుంది. రద్దీ తక్కువగా ఉన్నప్పుడు తక్కవ సమయానికే దర్శనం స్లాట్ లభిస్తుంది. ఎక్కువ సమయం ఉంటే ఆ సమయాన్ని అనుసరించి తిరుపతిలో స్థానిక ఆలయాలను దర్శించుకుని సమయానికి తిరుమలకు చేరుకుంటే పెద్దగా వేచి ఉండాల్సిన పని లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ఈ విదానం కింద రద్దీని అనుసరించి 25 వేల నుంచి 30 వేల టోకెన్లు మంజూరు చేస్తున్నారు. శుక్ర, శని, ఆది వారాలలో మినహా అన్ని రోజులలో తక్కువ సమయానికి దర్శనం కేటాయించబడుతుంది.

Related posts

జెర్సీ ఆవుకు ఓకే కాన్పులో నాలుగు దూడలు

Bhavani

తాజాగా అదే ఏఆర్ విభాగం ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ కూడాను….!

Satyam NEWS

ఐదు భద్రత పట్ల అవగాహన, ఆచరణకే “శౌర్య”

Bhavani

Leave a Comment