40.2 C
Hyderabad
April 19, 2024 15: 04 PM
Slider తెలంగాణ

ఏడేళ్లలో ఎప్పుడు లేదు…కొత్తగా ఈ బోర్డు ఏమిటి?

harish 15

ఏడేళ్లలో ఎప్పుడూ లేని సూతిల్ దారం కు రైతుల వద్ద డబ్బులు అడగటం ఏంటి…ఇది ఎప్పుడు చూడలేదు అని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాక మంత్రి హరీష్ రావు అన్నారు. ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండలం పర్యటనలో వెళుతున్న క్రమంలో గోంగూళూరు గ్రామం వద్ద రోడ్డు వైపు ఉన్న వరి దాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగి రైతులతో మాట్లాడారు. దిగుబడి, కొనుగోలు కేంద్రాల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం బస్తాలు కుట్టే సూతిలి రైతులే తెచ్చుకోవాలి రాసి ఉన్న బోర్డును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సూతిల్ తాడు కు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని వారు చెప్పగా. సూతిల్ దారం కు డబ్బులు అడుగొద్దు. మనమే తెచ్చివాలి ఇది నేను మొదటి సారి వింటున్న…ఈ ఏడేళ్లలో లేదు..రైతులకు సుతీల్ మనమే ఇచ్చే వాళ్ళం.. ఇప్పుడు కూడా మనమే ఇవ్వాలి.. రైతులు ఎక్కడికి వెళ్లకుండా..వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని. కొనుగోలు కేంద్రాల్లో సూతిలి తాళ్లు రైతులకు ఉచితంగా ఇవ్వాలని, వెంటనే హమాలి చార్జీలు రైతుల ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు…రైతు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఫోన్ లో ఆదేశించిన మంత్రి గారు .. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని , జిల్లాలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో అమలు చేయాలి అని ఎక్కడ వెంటనే అక్కడే ఉన్న కలెక్టర్ హనుమంతరావు రావును ఆదేశించారు.

Related posts

తెలగ, బలిజ, కాపు సంఘాల జేఏసీ నేత దాసరి రాముకు పరామర్శ

Bhavani

నాకు మంత్రి పదవి రాదు: కొడాలి నాని

Satyam NEWS

సిర్పూర్ గడ్డపై దోపిడీ పాలన పోవాలి

Satyam NEWS

Leave a Comment