28.7 C
Hyderabad
April 20, 2024 07: 37 AM
Slider తెలంగాణ

నిజమైన నిరుపేదలను గుర్తించేందుకు సాంకేతిక సహకారం

harish 02

సిద్దిపేట పట్టణ నిరుపేదల సొంతింటి కల నెరవేరిచే సంకల్పం తో నర్సపూర్ పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి దశలో ఉన్న నేపథ్యంలో లో హైదరాబాద్ అరణ్య భవన్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సెలక్షన్ కమిటీ సభ్యులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడు లేని నిరుపేదలకు, అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇల్లు ఎంపిక చేయాలని ఆదేశించారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హత లేని వారిని గుర్తించాలన్నారు.

పట్టణం లో 11వేల 657 దరఖాస్తులు వచ్చాయని అధికారులు మంత్రి కి వివరించారు.11వేల 657 దరఖాస్తుల్లో నిజమైన లబ్ది దారులకే దక్కే విధంగా చూడాలన్నారు. గతంలో ఆయా పథకాల ద్వారా ఇల్లు పొందిన వారిని, ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన వారిని గుర్తించాలన్నారు. అదేవిధంగా సొంతంగా స్థలాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉంటే వారిని అనర్హుల జాబితాలోకి చేర్చాలని ఆదేశించారు. ధరఖాస్తు దారుల్లో ఎవరికి ఎంత భూమి ఉంది, గృహ రుణాలు తీసుకున్న వారు ఎంత మంది, ఆస్తి పన్ను కట్టే వారిని, ట్రేడ్ లైసెన్స్ ఉన్న పెద్ద వ్యాపారులను గుర్తించి తొలగించాలన్నారు.

మున్సిపల్ పరిధిలో 50వేల విద్యుత్ కనెక్షన్ లు ఉన్నాయని, దరఖాస్తు చేసుకున్న వారి పేరుతో విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయోమో పరిశీలించాలని చెప్పారు. ఒకవేళ వారి పేరుతో విద్యుత్ కనెక్షన్ ఉంటే సొంత ఇల్లు ఉన్నట్టే అని నిర్ధారించి అనర్హులుగా గుర్తించాలన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించిన సమగ్ర వేదికను వినియోగించుకోవాలని ఎంపిక కమిటి సభ్యులకు సూచించారు. రాష్ట్రంలో 12 రకాల రికార్డులకు సంబంధించిన సమాచారం తో నిజమైన లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలో టి ఎస్ టి ఎస్ ఎం డి వెంకటేశ్వర్లు మంత్రి కి వివరించారు. సిద్దిపేట మున్సిపాలిటీ లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఈ సమాచారం తో బేరీజు చేసుకొని ఎంపిక చేయాలని కలెక్టర్ వెంకటామరెడ్డి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ టి ఎస్ ఎండి వేంకటేశ్వర్లు, జిల్లా అధికారులు శ్రవణ్, చరణ్ దాస్ , ఎస్ ఈ విద్యుత్ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

షర్మిల తెలంగాణ పార్టీలో పదవుల అమ్మకం

Satyam NEWS

సైబర్ నేరాల నిరోధానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు

Satyam NEWS

హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

Satyam NEWS

Leave a Comment