40.2 C
Hyderabad
April 19, 2024 18: 54 PM
Slider క్రీడలు ముఖ్యంశాలు

బీసీసీఐ సారధిగా వచ్చేసిన మాజీ సారధి గంగూలీ

gangooly

బీసీసీఐ(భారత క్రికెట్​ నియంత్రణ మండలి) 39వ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ నేడు పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఇంతటి అత్యున్నత పదవి సాధించిన రెండో భారత క్రికెటర్​గా గంగూలీ గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలిసి పని చేస్తానని క్రికెట్ ను మరింత ముందుకు తీసుకువెళతానని గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో వెల్లడించారు.

భారత క్రికెట్ కు కొహ్లీ ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని గంగూలీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. రవిశాస్త్రితో కూడా తనకు ఎలాంటి పొరపొచ్చాలు లేవని అందరిని కలుపుకుని వెళతానని గంగూలీ అన్నాడు. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి గంగూలీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు: గంగూలీకి ‘ప్రిన్స్ ఆఫ్ కలకత్తా’ అనే బిరుదు ఇచ్చాడు మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జెఫ్రీ బాయ్​కాట్. కానీ అంతకంటే ముందే దాదా తండ్రి అతడికి ‘మహరాజ్’ అనే ముద్దుపేరు పెట్టాడు.

1992లో వెస్టిండీస్​పై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గంగూలీ.. ఈ మ్యాచ్​లో మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం నాలుగేళ్ల పాటు అతడికి ఉద్వాసన పలికింది యాజమాన్యం. ఆటగాళ్లకు డ్రింక్స్​ పట్టుకురావడాన్ని నిరాకరించడం వల్ల అతడి ప్రవర్తన బాగా లేదని జట్టు నుంచి తొలగించారనే పుకార్లూ ఉన్నాయి. జట్టుకు దూరమైన సౌరవ్.. ఓ బౌలింగ్ వేసే యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంటివద్దే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు.

నాలుగేళ్ల తర్వాత ప్రసిద్ధ లార్డ్స్​ మైదానంలో టెస్టు అరంగేట్రం (1996) చేశాడు దాదా. అదే మ్యాచ్​లో సెంచరీ (131)తో అదరగొట్టాడు. కెరీర్​లో అక్కడ తొలి టెస్టు మ్యాచ్​ ఆడుతూ అత్యధిక స్కోర్ చేసిన వారిలో ఇప్పటికీ గంగూలీదే రికార్డు. 2003 ప్రపంచకప్​లో సెంచరీ చేయడం ద్వారా వరల్డ్​కప్ నాకౌట్​ మ్యాచ్​ల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్​గా ఘనత సాధించాడు. కెన్యాతో జరిగిన మ్యాచ్​లో 111 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్​మన్​గా గంగూలీ పేరిటే రికార్డు ఉంది. రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టు) కలిపి మొత్తం 18,433 పరుగులు చేశాడీ క్రికెటర్. (టెస్టుల్లో 7,212.. వన్డేల్లో 11,221) అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఎడమ చేతి వాటం బ్యాట్స్​మెన్​ రికార్డు గంగూలీ పేరిటే ఉంది. వన్డేల్లో 22, టెస్టుల్లో 16 చేశాడు. గంగూలీ ఒకసారి (1996) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. పాకిస్థాన్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్డేల్లో 10 వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్​లు పట్టిన ఐదుగురు క్రికెటర్లలో గంగూలీ ఒకడు. సచిన్, సనత్ జయసూర్య, కలిస్, దిల్షాన్ అతడి కంటే ముందున్నారు. గంగూలీ శతకం చేసిన ఏ టెస్టు మ్యాచ్​లోనూ భారత్ ఓడిపోలేదు

Related posts

రండి తరలి రండి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి

Bhavani

పైసా ఖర్చు లేని బదిలీలను వెంటనే చేపట్టాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Satyam NEWS

నిరుత్సాహం వద్దు భవిష్యత్తు మనదే

Satyam NEWS

Leave a Comment