32.2 C
Hyderabad
April 20, 2024 21: 38 PM
Slider హైదరాబాద్

రోడ్డు విస్తరణ పనులకు స్టాండింగ్ కమిటి గ్రీన్ సిగ్నల్

Bontu Rammohan

హైదరాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న నేడు స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌తో పాటు  స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు చెరుకు సంగీత ప్ర‌శాంత్ గౌడ్‌, స‌మీన‌బేగం, మ‌హ్మ‌ద్ అబ్దుల్ ర‌హ‌మాన్‌, ఎం.డి.మిస్బా ఉద్దీన్‌, మాజిద్ హుస్సేన్‌, ఎం.మ‌మ‌త‌, ఎక్కెల చైత‌న్య క‌న్నా, మ‌హ్మ‌ద్ అఖీల్ అహ్మ‌ద్‌, షేక్ హ‌మీద్‌, తొంట అంజ‌య్య‌, స‌బీహా బేగం, సామ‌ల హేమ‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ స‌మావేశంలో 27 ఎజెండా అంశాల‌ను చ‌ర్చించి ఆమోదించారు. స‌మావేశంలో ఆమోదించిన తీర్మానాలు: 1. పటాన్ చెరువు సర్కిల్ 22లో 41 మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు. 2. డి.ఆర్.ఎఫ్ కు హయత్ నగర్ (మ) ఫ‌తుల్ల‌గూడ‌లో ఓపెన్ స్పేస్ కేటాయింపు.  3. ఈ.వి.ఎం.డిలో వివిధ పార్కుల‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్‌ ఒక కేటగిరికి చేర్చి పునర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌.

4. ఈ.వి.ఎం.డి  ట్రాన్స్ పోర్ట్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న  డ్రైవర్ లు, లేబర్ ను ఆఫీసర్, వర్కర్ కేటగిరిలుగా చేయడం. 5. నాచారం మల్లాపూర్ నుండి  ప్రతిపాదిత మౌలాలి ఫ్లైఓవర్ వరకు 30 మీటర్లు  వెడల్పుతో రోడ్డు విస్తరణ, ఆస్తుల సేక‌ర‌ణ‌. 6. మూసి పై జియాగూడ – కిషన్ భాగ్ మధ్య 18 మీటర్లు బ్రిడ్జి నిర్మాణం, ఆస్తుల సేక‌ర‌ణ‌. 7.  అరబిoదొ నవయుగ సెజ్ నుండి  వయా నార్నే లే అవుట్ మీదుగా చందానగర్ రైల్వే స్టేషన్ రోడ్ వరకు 45 మీ. వెడల్పుతో రోడ్ విస్తరణ, భూ ఆస్తుల సేక‌ర‌ణ‌.

8. హైటెక్ సిటీ ఫేస్-2 నుండి గ‌చ్చిబౌలి ఇన్‌.ఆర్‌.బిట్ రోడ్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 9.  బ‌యోడైవ‌ర్సిటీ హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంకు నుండి జిహెచ్ఎంసి పార్కు హైటెక్‌సిటీ రోడ్డు వ‌ర‌కు లింక్ రోడ్ విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 10. హైటెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్ రోడ్డు జంక్ష‌న్ నుండి వ‌యా అర‌బిందో ద్వారా గౌసియా మ‌జీద్ రోడ్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌.

11. నోవాటెల్ నుండి ఆర్‌.టి.ఏ ఆఫీస్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 12. ప్ర‌గ‌తి న‌గ‌ర్ చెరువు నార్త్ నుండి జిహెచ్ఎంసి లిమిట్స్ బోరంపేట వ‌ర‌కు రేడియ‌ల్ రోడ్ల నిర్మాణానికి ఆస్తుల సేక‌ర‌ణ‌. 13. మెట్రో సూప‌ర్ మాల్ నుండి వ‌యా హెచ్‌.టి లైన్ ద్వారా జ‌గ‌ద్గిరిగుట్ట జంక్ష‌న్  ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 14. జె.వి హిల్స్ నుండి వ‌యా ప్ర‌భుపాద లేఅవుట్ హెచ్‌.టిలైన్ మార్గంలో రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌.

15. గోప‌నప‌ల్లి నుండి వ‌యా ప్ర‌ణీత్‌ప్ర‌న‌వ్ రోడ్ ద్వారా విప్రో వ‌ర‌కు మ‌దీన మ‌జీద్ హెచ్‌.పి పెట్రోల్ బంక్ మార్గంలో రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 16. క్రాంతివ‌నం లేఅవుట్ నుండి భాగ్య‌ల‌క్ష్మి లేఅవుట్ ను క‌లుపుతూ నార్నీ రోడ్డు వ‌ర‌కు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 17. బాపూఘాట్ బ్రిడ్జి నుండి మూసి రివ‌ర్ సౌత్ ప్యార‌లాల్‌గా అత్తాపూర్ ఫ్లైఓవ‌ర్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌.

18. మ‌ల్కారం చెరువు నుండి వ‌యా చిత్ర‌పురి కాల‌నీ ద్వారా ఖాజాగూడ మెయిన్ రోడ్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 19. మియాపూర్ మెట్రో డిపో నుండి వ‌యా ఐ.డి.పి.ఎల్‌, ఎంప్లాయిస్ కాల‌నీ, శ్రీ‌లాపార్కు ప్రైడ్‌, ప్ర‌తిపాదిత ఆర్‌.ఓ.బి ద్వారా కొండాపూర్ మ‌జీద్ జంక్ష‌న్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌. 20. నిజాంపేట్ క్రాస్ రోడ్ నుండి వ‌యా వ‌సంత‌న‌గ‌ర్ ద్వారా హైటెక్ సిటీ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌కు ఆస్తుల సేక‌ర‌ణ‌.

21. వెస్ట్ర‌న్ హోట‌ల్ నుండి మాదాపూర్ మెయిన్ రోడ్ వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ‌కు ఆస్తుల సేక‌ర‌ణ‌. 22. జిహెచ్ఎంసి సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ది చేస్తూ, నిర్వ‌హిస్తున్న సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌కు సాంకేతిక సేవ‌ల కింద మూడు సంవ‌త్స‌రాల కాలానికి 22 మాడ్యుల్స్‌కు రూ. 5,97,58,842 చెల్లించుట‌కు ఆమోదం.

23. జిహెచ్ఎంసిలో వైద్యాధికారులు నిర్వ‌హిస్తున్న‌ శానిటేష‌న్ విధుల‌ను పూర్తిగా ఎన్విరాన్‌మెంట్ ఇంజ‌నీర్లు, మున్సిప‌ల్ ఇంజ‌నీర్ల‌కు అప్ప‌గించట‌కు ఆమోదం. 24. వైద్యాధికారులు, హెల్త్ అసిస్టెంట్‌ల‌ను శానిటేష‌న్ విధుల నుండి మినహాయించి ఫుడ్ సేఫ్టీ, బస్తీ ద‌వాఖానాలు తదితర హెల్త్ రిలేటెడ్ అంశాల విధుల‌ను కేటాయించుట‌కు ఆమోదం. 25. జిహెచ్ఎంసి క్రీడా ప్రాంగణాల్లో నెల వారి మెంబ‌ర్‌షిప్ రేట్ల‌ను పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రించడం. 26. లీగ‌ల్ అడ్వైజ‌ర్ సేవ‌ల‌ను ఒక సంవ‌త్స‌రం పాటు పొడిగింపు. 27. టౌన్‌ప్లానింగ్ విభాగం హెడ్ ఆఫీస్‌తో పాటు ఖైర‌తాబాద్ స‌ర్కిల్ -14 కార్యాల‌యం ఆధునీక‌ర‌ణకు ఆమోదం.

Related posts

కేరళలో మళ్ళీ వెలుగులోకి సరికొత్త వైరస్.. నోరో వైరస్..

Sub Editor

దేశంలో ఎన్నో పార్టీలున్నయ్….మరి బీజేపీయే ఎందుకంటే……?

Satyam NEWS

నేరస్తులను గుర్తిస్తున్న సిసి కెమెరాలు

Satyam NEWS

Leave a Comment