Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

వడ్డికాసులవాడికి పెరుగుతున్న ఆదాయం

tirupati-1

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ప్రతి ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. భక్తులు సమర్పిస్తున్న నగదు, కానుకలతో ఆలయ పరకామణులు నిండిపోతున్నాయి. ఇప్పటికే నగదు రూపంలో ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయు వస్తుండగా, నెలకు కనీసం 60 కేజీల నుంచి 80 కేజీల వరకు బంగారం  అందుతున్నది. అలాగే 400 నుంచి 500కేజీల వెండి ని భక్తులు వేంకటేశ్వరుడికి భక్తితో సమర్పించుకుంటున్నారు. సగటున రోజుకు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు, నెలకు రూ.80 నుంచి 90 కోట్ల వరకు  నగదు ఆదాయం హుండీ ద్వారా లభిస్తోంది. తాజాగా ఈ ఏడు నాలుగు సార్లు వెంకన్న హుండీ ఆదాయం నెలకు వంద కోట్లు దాటేసింది. మార్చిలో రూ.105.89 కోట్లు, జూన్‌లో రూ.వంద కోట్లు, జూలైలో రూ.109.6 కోట్లు, ఆగస్టులో రికార్డు స్థాయిలో రూ.113.71 కోట్లు లభించింది. కాగా రానున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలలో మరో రెండు లేదా మూడు నెలలు, చివరి మాసంలో ఉన్న వైకుంఠ ఏకాదశి నెలలో మరో వంద కోట్లు అదాయం లభించవచ్చని ఆలయ వర్గాల అంచనా. స్వామివారికి అదాయంతో పాటు బంగారు కానుకలు కూడా భక్తుల నుండి పెద్ద ఎత్తున ముడుపులుగా అందుతున్నాయి. అయిదు నెలల కాలంలో 524 కిలోల బంగారు కానుకలు హుండీ ద్వారా వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 180 కిలోలు ఎక్కువ. అలాగే ఏ నెలకు ఆ నెల సుమారు 80 కేజీల వరకు బంగారం స్వామి వారికి భక్తులు కానుకలుగా ఆపదమొక్కులవాడికి సమర్పించుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నెలకు వంద కిలోల బంగారం కానుకల రూపంలో వస్తుందని అంచనా. వెండి కానుకలు కూడా గత ఏడాదికన్నా రెట్టింపు అంటే  3,098 కిలోలు వచ్చాయి. విరాళాలు మొదలు, గదుల అద్దెల వరకు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంది. భక్తులకు ఏడుకొండల వాడిపై ఉన్న నమ్మకంతోనే అదాయం గణనీయంగా పెరుగుతోంది.

Related posts

కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు జూపల్లి అభినందన

Satyam NEWS

ప్రొటెస్ట్ ఫైర్: వికేంద్రీకరణపై జాతీయ రహదారి పై మంటలు

Satyam NEWS

ఠారెత్తిస్తున్న కొత్త మోటారు వాహన చట్టం

Satyam NEWS

Leave a Comment