28.2 C
Hyderabad
April 20, 2024 13: 51 PM
Slider తెలంగాణ

మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా

Gutha-700x400

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.  గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు మంత్రులు హరీష్‌ రావు, కెటిఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని వారు అభినందించి , శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా గతంలో ఎంపిగా పని చేశారు. ఇటీవల ఆయన శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం మండలి చైర్మన్ గా స్వామిగౌడ్ నియమితులయ్యారు. స్వామిగౌడ్ పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29న ముగిసింది. నాటి నుంచి మండలి తాత్కాలిక చైర్మన్ గా నేతి విద్యాసాగర్ పని చేశారు. ఈ క్రమంలో బుధవారం గుత్తా మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి గుత్తా అని ప్రశంసించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాడాలని కోరుకున్న బలమైన నేతల్లో గుత్తా ఒకరని కొనియాడారు.మా వయసు కన్న ఎక్కువ రాజకీయ అనుభవం కల్గిన వ్యక్తి గుత్తా అని మంత్రి కెటిఆర్ పొగిడారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన వ్యక్తి అని ప్రశంసించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడిన నాయకులు గుత్తా అని కెటిఆర్ కొనియాడారు.

Related posts

ప్రపంచ సంపన్నుడిగా మళ్లీ ఎలాన్ మస్క్

Satyam NEWS

సెన్సార్ బోర్డు తీరుపై “భారతీయన్స్” అభ్యంతరకరం

Satyam NEWS

అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమే…

Satyam NEWS

Leave a Comment