Slider ఆదిలాబాద్

కాగజ్ నగర్ కాలేజీలో కేసీఆర్ జన్మదిన హరితహారం

harita haram 1

కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలను “హరిత హారం” కార్యక్రమంగా  నిర్వహించారు. “వన సంరక్షణ…మన సంరక్షణ” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యన్ యస్ యస్ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు, అధ్యాపకులు  మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో  ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ మొక్కల ప్రాధాన్యతను, పర్యావరణ పరిరక్షణను తన జన్మదినంగా ముఖ్యమంత్రి జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు.  విద్యార్థులు మొక్కలు నాటడాన్ని తమ కర్తవ్యంగా భావించాలని అన్నారు.

మొక్కలు ఎదిగేంత వరకు రోజూ నీరందేలా కృషి చేయాలని అన్నారు. “వృక్షో రక్షతి రక్షిత:”  అనే ఆర్యోక్తిని అందరూ పాటించాలని అన్నారు.  ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు  రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న “హరిత హారం” కార్యక్రమం ప్రాధాన్యతను గూర్చి వివరించారు.

ఈ  కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కళ్యాణి, ఆసిఫ్,జూఫిషా జాతీయ సేవా పథకం ప్రోగ్రాం యూనిట్ అధికారులు రవి, మన్మోహన్ అధ్యాపకులు మునావర్ హుస్సేన్ ,ఆనంద్, నర్సయ్య,శంశుద్దీన్, మన్ మోహన్, ప్రసాద్,అశోక్, భిక్షపతి, రజాక్, రహీమ్, సిబ్బంది దీపాంకర్, ఉమ తదితరులు పాల్గొన్నారు.

Related posts

టై అప్:అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో న్యూజిలాండ్

Satyam NEWS

రోడ్లు ఊడ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

కార్మికుల సమ్మెకు కాదు టిఎస్ ఆర్టీసీకే చట్టబద్ధత లేదు

Satyam NEWS

Leave a Comment