39.2 C
Hyderabad
March 29, 2024 15: 03 PM
Slider మహబూబ్ నగర్

చెంచులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం

health camp

చెంచు కాలనీ లో నిమ్న జాతుల ట్రైబల్ అభివృద్ధి అథారిటీ వారి సౌజన్యం తో  మొలచింతలపల్లి బ్రమరాంభ  చెంచు కాలనీ వాసులకు ITDA అదనపు వైద్యాధికారి డా.మొహనయ్య,  సర్పంచ్ కొమ్ము రాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ వైద్యశిబిరం లో చిన్న పిల్లల డాక్టర్ రంజిత్,  జెనరల్ మెడిసిన్ డాక్టర్ చంద్ర శేఖర్ అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెంట్లవెలి డా.చెంద్రశేఖర్,  DMO వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు ఈ శిబిరంలో వైద్య సేవలు అందించారు. అదే విధంగా జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించడం జరిగింది.

వైద్య సిబ్బంది చేత గూడెం లో అంటి లార్వా ఆపరేషన్స్ చేశారు. మురుగు నీటి నిల్వలను ఎప్పటికపుడు తొలగించుకోవాలని అవగాహన కల్పించారు. చిరు వ్యాదులకు అక్కడికక్కడే మందులు ఇవ్వడం జరిగింది. గర్భిణీలకు HB టెస్ట్ వారి కి అందే సేవల వివరాలను తెలిపారు.

CHO ప్రభు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామ్మోహన్,అశోక్ ప్రసాద్, నిరంజన్, DPMO జ్యోతి, టీబి సూపర్ వైజర్ రాజ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్  దివాకర్, ప్రకాష్ , భాగ్యమ్మ, వెంకటమ్మ  ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నారాయణ…. నారాయణ… కాషాయ కమ్యూనిస్టు

Satyam NEWS

అప్పుల తెలంగాణగా మార్చారు

Bhavani

కాంగ్రెస్ వాష్ అవుట్: యుపి శాసన మండలిలో కొత్త చరిత్ర

Satyam NEWS

Leave a Comment