39.2 C
Hyderabad
March 29, 2024 16: 27 PM
Slider ఆంధ్రప్రదేశ్

కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భారీ వర్ష సూచన

rains in ap

లక్షదీవుల ప్రాంతం నుంచి కోస్తా వరకు ఉపరితలద్రోణి ఆవరించింది. ఆగ్నేయ/దక్షిణ దిశ నుంచి కోస్తాపైకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వేగవంతం కావడంతో రానున్న వచ్చే రెండు, మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Related posts

వచ్చే నెల లో ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన

Satyam NEWS

లాక్ డౌన్ లో స్ఫూర్తిగా నిలుస్తున్న కానిస్టేబుల్స్ సేవలు

Satyam NEWS

బియ్యం పంపిణీ చేస్తున్న గాయత్రి ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment