28.2 C
Hyderabad
April 20, 2024 14: 07 PM
Slider కృష్ణ

‘‘వై’’ దిస్ కొలవరి: స్మశానంలో పేదలకు ఇళ్ల స్థలాలు

mylavaram sites

ఇళ్ల స్థలం ఇస్తాం రమ్మంటే పాపం అక్కడి పేదలు ఎగేసుకుని వెళ్లారు. తీరా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి చూపించింది ఏమిటంటే స్మశానం స్థలం. స్మశానం స్థలాన్ని చదును చేసి ఇస్తాం తీసుకోండి అని అధికారులు చెప్పడంతో ఒక్క సారిగా పేద ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామంలో ఉన్న సుమారు 1800 మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తామని వైసిసి ప్రభుత్వం వాగ్ధానం చేసింది.

గొల్లపూడిలో స్ధలం లేదని, గొల్లపూడికి   సుమారుగా 10 కిలోమీటర్లు దూరంలోని పాతపాడు గ్రామంలో ఊరు బయట చెత్త నిల్వ ఉంచే స్ధలంలోను, స్మశానం ఉండే చోట చదును చేసి ఇస్తామని చెప్తున్నారు.  ఇళ్ల స్ధలాల బాధితులు  ఆ స్ధలంలో మాకు వద్దని, చెత్త, స్మశానం ఉండే చోట ఉంటే చిన్న పిల్లలకు రోగాలు వస్తాయని, వర్షకాలంలో మునిగి పోతాయని మహిళలు ఆందోళన చెందుతున్నారు.

Related posts

పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు లో ప్రభుత్వ నిర్లక్ష్యం

Satyam NEWS

Good News: అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు

Satyam NEWS

కాంట్రవర్సి:బీఫ్ వంటకంపై కేరళలో వివాదం

Satyam NEWS

Leave a Comment