35.2 C
Hyderabad
April 20, 2024 15: 20 PM
Slider తెలంగాణ సంపాదకీయం

కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి ఎన్నిక

pjimage (4)

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇక చివరి ఎన్నిక కానున్నది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గెలిచినా కూడా ఇదే చివరి ఎన్నిక అవుతుంది. రాష్ట్రంలో కనిష్ట స్థాయికి వెళ్లిపోయినా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ మాత్రం బుద్ధి రాలేదు. గ్రూపుల తగాదాలే కాంగ్రెస్ పార్టీని కొంప ముంచుతుంటాయి. గతంలో ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతున్నది.

రాష్ట్రంలో 27 నుంచి 30 శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఇప్పుడు దిగజారిపోయింది. లీడర్లు కొట్టుకున్నా క్యాడర్ లేకున్నా సాంప్రదాయంగా వచ్చే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వరం. అయితే ఇప్పుడు ఆ వరం విలువ రోజు రోజుకూ తగ్గిపోతున్నది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత ఈ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీని మర్చిపోవడమే. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య అయిన పద్మావతిని తాను ఖాళీ చేసిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్ధిగా ప్రకటించారు. పద్మావతి గత అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

అప్పటి వరకూ కోడాదకు ప్రాతినిధ్యం వహించిన పద్మావతి ప్రజలకు దూరం కావడం వల్లే ఓటమి సంభవించిందని అప్పటిలో కాంగ్రెస్ పార్టీ నాయకులే విమర్శించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయినందున కోదాడ అసెంబ్లీ స్థానానికి జరిగిన కతలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదనంతర పరిణామాలతో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు.

దాంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. తద్వారా ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానాన్ని ఖాళీగా ఉన్నతన సతీమణి పద్మావతికి కట్టబెట్టుకున్నారు. ఒక రకంగా చూస్తే పద్మావతి కన్నా మెరుగైన అభ్యర్ధి అక్కడ కాంగ్రెస్ పార్టీకి దొరకడం కష్టం. పద్మావతి గురించి కోదాడ ప్రజలకు తెలుసు కానీ హుజూర్ నగర్ ప్రజలకు ఉత్తమ్ భార్యగా మంచి పేరే ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరు అనే పేరు తప్ప వేరే వ్యతిరేకతలు లేని అభ్యర్ధి పద్మావతి.

అయితే పద్మావతి అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపి ఏ రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించారు. ఆయన తన అభ్యర్ధిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ని ప్రకటించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీకి మిగిలి ఉన్న శ్రేణులు విస్తుపోయాయి. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి రాదు అనే నిర్ణయానికివచ్చేశారు.

కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పు పట్టడంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం ప్రారంభించాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్ధిక మంత్ర్ హరీష్ రావు తో కలిసి మంతనాలు జరపడం పై వేల అనుమానాలు రేకెత్తుతున్నాయి. పద్మావతి అభ్యర్ధిత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న హస్తం బ్యాచ్ ఆమెను ఓడగొట్టేందుకు వ్యూహం రూపొందించుకున్నాయనే సంకేతాలు వెళ్లాయి.

ఆ తర్వాత రేవంత్ రెడ్డి తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతం. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన మద్దతును ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రకటించడం ఒక్కటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశం. ఇంత దారుణమైన స్థితిలో పార్టీ ఉన్నా కూడా గ్రూపులుగా విడిపోయి  కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అందుకే ఇవి చివరి ఎన్నికలు. హుజూర్ నగర్ లో గెలిచినా ఓడినా.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

Related posts

అమ్మంటే అలానే!!

Satyam NEWS

నాసిరకం పనులతో కుప్పకూలిన భగీరథ ట్యాంక్

Satyam NEWS

ఘనంగా ఏఎస్ఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment