37.2 C
Hyderabad
March 29, 2024 20: 20 PM
Slider ముఖ్యంశాలు

వాట్సాప్ ద్వారా ఐఐటీ -జేఈఈ ఫోరమ్ బుక్ లెట్

iit jee booklet

ఐఐటీ-జేఈఈ(అడ్వాన్స్డ్ ) కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్, విద్యా రంగ సలహాదారుడు కే.లలిత్ కుమార్ పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు. ఐఐటీ -జేఈఈ కి సంబంధించి 12 సంవత్సరాల అనుభవంతో ఆయన తీసుకువస్తున్న ఈ 100 పేజీ ల  పుస్తకం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కోసం నిర్దేశించింది.

2014 నుండి 2019 సంవత్సరాల మధ్య కాలంలో జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల వివరాలు ఇందులో ఉంటాయి. మార్కులు ర్యాంకుల వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. మార్కులు ర్యాంకులు చూసుకున్న తర్వాత సీట్లు కేటాయింపు విషయాన్ని ఇందులో వివరించారు. అదే విధంగా ప్రశ్నల కేటాయింపు, కట్ ఆఫ్ మార్కులు, రిజర్వేషన్స్ వారీగా సీట్లు కేటాయింపు తదితర సమగ్ర సమాచారాన్నిఇందులో అందచేస్తున్నారు.

ఐఐటీ -జేఈఈ ఫోరం సహకారం తో పుస్తకాన్ని ఐఐటీ -జేఈఈ ఫోరం కన్వీనర్ విశేష అనుభవం ఉన్న కే. లలిత్ కుమార్ తన అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించారు. విద్యార్ధులు వారి తల్లిదండ్రుల సమాచారం కోసం ఈ పుస్తకాన్ని వాట్సాప్ ద్వారా కూడా పంపాలని నిర్ణయించారు. ఈ బుక్ లెట్ కావాల్సిన వారు వాట్సప్ నెంబర్ 98490 16661 ను సంప్రదించవచ్చు.

Related posts

తిరోగమన దిశగా బిజెపి

Bhavani

జీవో 59 ని సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

కరోనా వ్యాక్సిన్ వికటించడంతో డాక్టర్ కు తీవ్ర అస్వస్థత

Satyam NEWS

Leave a Comment