36.2 C
Hyderabad
April 23, 2024 21: 31 PM
Slider మహబూబ్ నగర్

ఇల్లీగల్: నది మనదే ఇసుక తోడుకో డబ్బు దోచుకో

sand filling

దొంగలు  దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు కొల్లాపూర్ లో ఇసుక పంచుకుంటున్నారు. సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తోలుకుంటే అడ్డుపడి నానా గొడవ చేసే అధికారులు ఇసుక మాఫియా ట్రాక్టర్లకు ట్రాక్టర్ల ఇసుకను తరలించుకుపోతుంటే మాత్రం కళ్లు మూసుకుని కూర్చుంటున్నారు.

విచిత్రం ఏమిటంటే కొల్లాపూర్ పట్టణంలో సిసి కెమెరాలు ఉన్నాయి. వాటిల్లో అన్నీ రికార్డు అవుతుంటాయి కానీ వాటిని పరిశీలించే తీరిక కూడా అధికారులకు లేదు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అక్రమ ఇసుక సరఫరా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని అందరూ చెప్పుకుంటున్నా అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు.

పట్టణం నడి బొడ్డు న ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో ఇసుక ట్రాక్టర్ మీద ట్రాక్టర్లు సప్లై అవుతుంటే అడిగే వారు కరువయ్యారు. వాస్తవంగా అన్ని అనుమతులు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అయితే అనుమతులు లేకుండా అడ్డగోలుగా, ఇష్టానుసారంగా నాయకుల అండదండలతో ఇసుక దోపిడి చేసుకుంటున్నారు.

ఈ అంశం పై రెవెన్యూ అధికారులు ఎంక్వయిరీ చేయకపోతున్నారు. కారణం వారికే తెలియాలి. రెవెన్యూ అధికారులే ఇసుక రవాణా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సరఫరా అవుతున్నదని చెబుతున్నారు కానీ చర్యలు తీసుకోలేకపోతున్నారు.

సిసి కెమెరాల ఆధారంగా ఇసుక ట్రాక్టర్లను గుర్తుపట్టి చర్యలు తీసుకోవచ్చు కానీ పెద్దల ప్రమేయం ఉందేమో రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. దాంతో ఇసుక అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తోడేసుకుపోతున్నారు. అనుమతులు లేని ఇసుక సరఫరా చేస్తున్న వారిపై కేసు నమోదు చేయవచ్చు ఇవన్నీ కాకుండా చూస్తూ ఊరుకున్న అంటే అర్థం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా అవుతుంటుందనే విషయం అధికారులకు కూడా తెలుసు. ఈ విషయంపై రాష్ట్ర అధికారులు తక్షణమే స్పందించి ఇసుక ఎక్కడి నుండి సప్లై అవుతుంది సరఫరా చేసుకుంటున్న వాళ్ళకు అనుమతి ఉందా లేదా ఇక్కడ అధికారులు ఏమి చేస్తున్నారు అనే అంశంపై ఆరా తీస్తే అసలు రంగు బయటికి వస్తుంది. ఎవరికైనా అనుమతులు ఉంటే ఎవరూ అడ్డుపడరు. అందుకే రాష్ట్రం ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరి ఇంత  జరుగుతున్న అడిగే నాథుడు మాత్రం కరువయ్యారు. బహుశ ఇదే కొల్లాపూర్ స్పెషాలిటీ అయి ఉంటుంది.

Related posts

మిషన్ భగీరథ పనుల పట్ల అలసత్వం వహించ వద్దు

Satyam NEWS

నందలూరు రైల్వేలో కోవిడ్19 ఐసోలాషన్ వార్డ్

Satyam NEWS

నెల్లూరు రంగనాయకల పేట లో ఉగాది ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment