28.7 C
Hyderabad
April 20, 2024 04: 39 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీ

INS Khanduri

నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకొనే చర్యల్లో భాగంగా పూర్తి దేశీ పరిజ్ఞానంతో భారత్‌లో తయారైన అత్యాధునిక స్కార్పీన్‌ జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ఖండేరీని శనివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో సముద్రంలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఆరు స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్‌ ఖండేరీ దేశంలోనే ఆధునిక ఫీచర్లున్న జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ గ్రూప్‌ దీని ఆకృతిని రూపొందించగా, ముంబయికి చెందిన మజగావ్‌ డాక్‌ లిమిటెడ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఐఎన్‌ఎస్‌ ఖండేరీని సైలెంట్‌ కిల్లర్‌ గా కూడా పిలుస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐఎన్‌ఎస్‌ ఖండేరీ పొడవు 67.5 మీటర్లు, నాలుగు ఎంటీయూ 12 వీ 396, 84 ఎస్‌ఈ 360 ఇంజిన్లు, భారీ బ్యాటరీలు ఉంటాయి. ఇది సముద్రగర్భంలో 20 నాటికల్‌ మైళ్ల (37 కి. మీ) వేగంతో, 350 మీటర్ల లోతులో రోజుల తరబడి ఏకధాటిగా ప్రయాణించగలదు. ఐఎన్‌ఎస్‌ ఖండేరీని శత్రునౌకలు గుర్తించడం అత్యంత కష్టం

Related posts

రేపటి నుంచి మీసేవ నిర్వాహకుల నిరవధిక బంద్

Satyam NEWS

యువత ఆలోచనలకు అద్దం గుజరాత్ ఫలితాలు

Satyam NEWS

కన్సూమర్ ఎఫైర్ విజిలెన్స్ కమిటీకి అనితారెడ్డి

Satyam NEWS

Leave a Comment