28.7 C
Hyderabad
April 20, 2024 07: 17 AM
Slider సంపాదకీయం

డబుల్ ధమాకా: వైసిపికి చెంప దెబ్బ టిడిపికి గోడ దెబ్బ

bjp pawan

జనసేన అనుకున్నంత పనీ చేసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా అధికార వైసిపిని, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీనీ ఒకే సారి ఆశ్చర్యానికి గురిచేసే చర్యను చేసేసింది. ఎన్నికలు మరో నాలుగేళ్లు ఉండగానే బిజెపి జనసేన ఇప్పుడే కలవడం ఆశ్చర్యం కలిగించే పరిణామమే.

ఈ రెండు పార్టీలూ ఇప్పుడే పొత్తు ఎనౌన్స్ చేస్తాయని మిగిలిన రెండు పార్టీలూ ఊహించి ఉండవు. జనసేన బిజెపి పొత్తు పెట్టుకోవడమే కాదు. ఇకపై తెలుగుదేశం పార్టీతో కలిసే అంశమే ప్రస్తావనకు రాదని బిజెపి ప్రకటించింది. ఇది తెలుగుదేశం పార్టీని నీరసపరిచే ప్రకటన. అంతే కాదు.

అధికార వైసిపితో తమకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని ప్రకటించడం అధికార పార్టీకి ఒక రకంగా షాక్. ఇటీవల ఒక సంఘటన జరిగింది. జె డి లక్ష్మీనారాయణ శిష్యుడైన ఒక అధికారి సిబిఐలో ఉండి తమను రాజకీయ కోణంలో చూస్తున్నారని, తమపై ఉన్న అక్రమాస్తుల కేసు ను ఆయన రాజకీయ కోణంలో చూడటం వల్ల తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని తక్షణమే ఆయనను బదిలీ చేయాలని విజయసాయిరెడ్డి కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు.

ఆ లేఖను హోం మంత్రి తన డిపార్ట్ మెంటు పంపారు. దీన్ని వైసిపి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకున్నది. తాము రాసిన లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిగణలోకి తీసుకున్నారని అందువల్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తాము సన్నిహితంగా ఉన్నామని చెప్పేందుకు ఎంతో శ్రమ పడ్డారు.

నిజంగానే అమిత్ షా ఇంతగా స్పందించారా అనే అనుమానం కూడా చాలా మందికి వచ్చింది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే తమతో పవన్ కల్యాణ్ కలిసి ఉన్నాడనే ప్రచారాన్ని పరోక్షంగా చేసుకుంటూ ఆనందం పొందుతున్నారు. తిడితే పడటానికి నేనే చంద్రబాబునాయుడ్ని కాదు అని పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పినా తెలుగుదేశం పార్టీ నేతలు తమకు జనసేన తో దగ్గర అనే ఫీలింగ్ ఇవ్వడానికే ప్రయత్నించారు.

ఒక వైపు బీజేపి మరో వైపు జనసేన తమకు దగ్గరంటే తమకు దగ్గరని రుజువు చేసుకోవడానికే ఆ రెండు పార్టీలు తాపత్రపడటం వల్ల వారిద్దరికి ఈ నిర్ణయం షాక్ కలిగించి ఉంటుంది.

తెలుగుదేశం, వైసిపి లతో తాము భవిష్యత్తులో కూడా ఎలాంటి సంబంధాలు పెట్టుకునేది లేదని బిజెపి చెప్పడం కూడా గమనార్హం. ఇప్పుడు చంద్రబాబుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిసి వెళ్లడం తప్ప వేరే దారి లేదు. వైసిపి తన బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటూ ఒంటరిగా మిగిలిపోవడం తప్ప మరో మార్గం లేదు.

ఇక అధికార వైసిపి రాజధానిపై అడుగు ముందుకు వేయడానికి ఆలోచించాలి. ఉద్యమం చేయడానికి తెలుగు దేశం ఆలోచించాలి. ఇక బిజెపి జనసేనలు అటు నుంచి ఇటు నుంచి కూడా చక్కబెట్టేస్తాయి.

Related posts

ఎంపీ బిబిపాటిల్ చొరవతో రెండు రోజుల్లో స్వగ్రామానికి మృతదేహం

Bhavani

ఈ దౌర్భాగ్యులిద్దరికి ఏం శిక్ష వేయాలో మీరే చెప్పండి

Satyam NEWS

సమాచార హక్కు చట్టం జుక్కల్ బాధ్యుల నియామకం

Satyam NEWS

Leave a Comment