27.7 C
Hyderabad
March 29, 2024 02: 11 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

జర్నలిస్టు సత్తిబాబు మర్డర్ ఒక మిస్టరీ

pjimage (14)

జర్నలిస్టు సత్తిబాబును ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? రెండు తెలుగు రాష్ట్రాలలోని అందరు జర్నలిస్టులను కలవరపరచిన తుని ఆంధ్రజ్యోతి రూరల్ విలేకరి కాతా సత్యనారాయణ హత్య కారణంగా వచ్చిన ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకూ సమాధానం లేదు. జర్నలిస్టు హత్య పై మిష్టరీని తక్షణమే ఛేధించాలని, నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీస్ చీఫ్ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి కూడా ఆదేశాలు అందాయి.

రాజకీయంగా వివాదాలు తప్ప చంపుకునేంత ముఠా కక్షలు ఉండని తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో ఒక విలేకరిని దారుణంగా నరికి చంపేంత కక్ష ఎవరికి ఉంటుంది? నడిరోడ్డుపై రెక్కీ చేసి, ఆ తర్వాత ఒక సారి ప్రయత్నించి చివరకు దారుణంగా చింపేసినా పోలీసులు ఏం చేస్తున్నారు? సత్తిబాబు పై హత్యాయత్నం జరిగిన తర్వాత జర్నలిస్టు సంఘాలు స్థానిక పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది మాత్రం వాస్తవం. కేసును ఈ కోణం నుంచి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. పోలీసులు సత్తిబాబు పై జరిగిన హత్యాయత్నాన్ని సాధారణ కేసుగా ఎందుకు తీసుకున్నారు? సత్తిబాబు చాలా యాక్టీవ్ గా ఉండే జర్నలిస్టు.

భూ వివాదాలలో తనదైన శైలిలో అతను పరిష్కారాలు చూపిస్తుండేవాడని కూడా స్థానికులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట అతను ఒక భూ వివాదానికి సంబంధించి వార్త రాశాడు. ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారనేది ఆ వార్త సారాంశం. ఈ వార్త రాసిన తర్వాత సత్తిబాబుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ కాల్ రికార్డింగ్ లను కూడా జర్నలిస్టు సంఘాలు పోలీసులకు అందచేశాయి. మొదట హత్యాయత్నం జరిగినపుడు ఈ విషయాలన్నీ పోలీసులకు తెలియచెప్పారు. మళ్లీ అదే ప్లేస్ లో హత్య జరిగింది.

ఈ సారి పకడ్బందీగా హత్య జరిగింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటున్న వారి గురించి వార్త సారిన తర్వాత జరిగిన ఈ దాడిని సంబంధిత వ్యక్తులకే ఆపాదించాల్సి ఉంటుందని పలువురి అభిప్రాయం అయితే జర్నలిస్టు సత్తిబాబు కుటుంబానికి సంబంధించిన భూ వివాదాలు కూడా ఉన్నాయని తెలిసింది. జర్నలిస్టు సత్తిబాబు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడికి సన్నిహితంగా ఉండేవాడు. యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు సత్తిబాబు ప్రభుత్వ పరంగా ఉన్న పనులను చాలా మందికి చేసి పెట్టేవాడు. సత్తిబాబు సోదరుడు స్థానికంగా న్యాయవాది. ఈ కేసు విచారణ రాజకీయాలకు అతీతంగా జరిగితే మరోన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Related posts

బిఓసిడబ్ల్యు కార్డుతో భీమా సౌకర్యం

Satyam NEWS

ఉత్తమ జర్నలిస్టులకు ఘనంగా సన్మానం

Satyam NEWS

నీ భార్యను కిడ్నాప్ చేయించిన వారిని ఏమీ అనలేక నన్ను తిడతావా?

Satyam NEWS

Leave a Comment