27.7 C
Hyderabad
April 19, 2024 22: 57 PM
Slider తెలంగాణ

కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు జూపల్లి అభినందన

Jupally KTR

టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ని కలిసి రాష్ట మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది కాలంలో టీఆర్ఎస్ పార్టీని ఎంతో సమర్ధంగా నడిపినందుకు జూపల్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఏ ఎన్నిక జరిగినా విజయపథంలో నడిపిస్తున్న నవ నాయకుడు కేటీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రభుత్వానికి పార్టీ కి మధ్య మంచి సమన్వయం ఉన్నందున అన్ని ఎన్నికల్లో విజయం సాధ్యమౌతున్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువస్తున్న అద్భుత పథకాలు ప్రజాబాహుళ్యంలోకి వెళుతున్నాయంటే దానికి పార్టీ యంత్రాంగమే కారణమని అలాంటి సమర్ధ యంత్రాంగానికి నాయకుడుగా కేటీఆర్ ఉండటం తమ అదృష్టమని జూపల్లి కృష్ణారావు అన్నారు. మాజీ మంత్రి జూపల్లితో బాటు కేటీఆర్ ను అభినందించిన వారిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఉన్నారు.

Related posts

ఉపశమించిన గోదారమ్మ ఊపిరి పీల్చుకున్న రెవిన్యూ అధికారులు

Satyam NEWS

అరసవల్లి పెద్దాయన..అయిన వారి కోసం పోలీసుల చూపు…!

Satyam NEWS

చంద్రబాబును, అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment