38.2 C
Hyderabad
April 25, 2024 12: 35 PM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

చంద్రబాబును వదిలేస్తున్న కమ్మ కులస్తులు

cbn 30

అధికారం ఉన్నంత కాలం చంద్రబాబునాయుడి చుట్టూ ఉన్న కమ్మ కులానికి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గమే చంద్రబాబునాయుడిని తెలుగుదేశం పార్టీని వదిలేస్తుంటే ఇక ఆ పార్టీ బతికి బట్టకట్టే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదనేవాదన వినిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీని కమ్మ కుల నాయకులు వదిలివేయడం సుజనా చౌదరి నుంచి ఆరంభమై కొనసాగుతూనే ఉంది.

బిజెపిలోకో, వైసిపిలోకో వెళ్లేందుకు కమ్మ కుల నాయకులు ఉత్సాహం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నంత కాలం కమ్మ కుల నాయకులే ఆయన చుట్టూ ఉన్నారు. అధికారంలో వారిదే సింహభాగం. కాంట్రాక్టుల నుంచి అన్నీ కమ్మ కులానికే దక్కాయి. ఈ కారణంగానే కమ్మ కులంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం కోపం పెంచుకున్నది. కమ్మ కులానికి చెందిన వారే అధికారంలో సింహ భాగం అనుభవిస్తున్నారని చంద్రబాబునాయుడికి తెలిసినా ఏ కారణం వల్లనో ఆయన దాన్ని సరిదిద్దుకోలేదు.

అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబునాయుడు ఈ విధంగా చేయలేదు. దాదాపు అన్ని కులాలను ఆయన చేరదీశారు. అధికారంలో కూడా కమ్మ వారి పాత్ర పరిమితంగానే ఉంచేవారు. అప్పటిలో చంద్రబాబునాయుడు ఒరిజినల్ కమ్మ (కృష్ణా జిల్లా కమ్మ) కాకపోవడం వల్లే కమ్మ వారిని దగ్గరకు రానివ్వడం లేదని అదే కులానికి చెందిన వారు బాహాటంగానే వ్యాఖ్యానించేవారు. అధికారంలో, కాంట్రాక్టులలో కూడా కమ్మ వారి పాత్ర మితంగానే ఉండేది.

అయితే రాష్ట్రం విడిపోయి అవశేష ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబునాయుడు కేవలం కమ్మ కులానికి మాత్రమే తాను ప్రతినిధిని అన్నట్లుగా వ్యవహరించారు. ఫలితంగా 23 స్థానాలకు పరిమితం అయిపోయారు. 13 జిల్లాల్లో ప్రతి గ్రామంలో కూడా కమ్మ కులం వారికి దక్కిన ప్రాధాన్యతను చూసి మిగిలిన కులాలు తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ కుల ఆశ్రయంగా మారింది. ఇప్పుడు అధికారం పోగానే అదే కమ్మ కులం తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతున్నది.

దూరం జరగడమే కాదు చంద్రబాబునాయుడిపై దారుణమైన వ్యాఖ్యలుకూడా చేస్తున్నారు. కమ్మ కులం దూరంగా జరుగుతుండటంతో అసలు తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనే అనుమానం మాత్రం పెరిగిపోతున్నది. తెలంగాణలో ఇదే జరిగింది. కమ్మ కులస్తులంతా ఇప్పుడు టిఆర్ ఎస్ వైపు వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది.

Related posts

జాతీయ ఓటర్ల దినోత్సవానికి అధికారులు హాజరు కావాలి

Satyam NEWS

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

Satyam NEWS

వెల్ డన్: కొల్లాపూర్ లో సంపూర్ణంగా జనతా కర్ఫ్యూ

Satyam NEWS

Leave a Comment